సైబర్ మోసంలో డబ్బులు పోయాయా? రిఫండ్ ఇవ్వబోతున్న కేంద్రం ..!
మన దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సైబర్ మోసాల్లో డబ్పులు కోల్పోయిన వారు అడుగడుగునా కనిపిస్తున్నారు. సోషల్ ప్లాట్ ఫామ్స్, బ్యాంక్ అకౌంట్లు, ఓటీపీలు, లింక్స్ ఇలా వివిధ మార్గాల్లో జనం తాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని సైబర్ క్రిమినల్స్ కు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగిపోతోంది. సైబర్ క్రైమ్స్, మోసాల్ని అరికట్టే విషయంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం సంగతి దేవుడెరుగు ఇప్పుడు రిఫండ్ ఇస్తే ఎలా ఉంటుందని కేంద్రం ఆలోచిస్తోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెబ్ సైట్ నివేదించింది.
సైబర్ నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి రెస్పాన్స్ ను బలోపేతం చేయడానికి, ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులకు సకాలంలో ఉపశమనం కల్పించడానికి కేంద్ర హోంశాఖ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని తాజాగా ఆమోదించింది.
కొత్త నిబంధనల ప్రకారం ఇలా సైబర్ మోసాలు జరిగినప్పుడు బాధితులకు రూ.50వేల వరకూ ఉన్న మొత్తాల్ని కేంద్రమే తిరిగి ఇవ్వబోతున్నారు.

కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండానే ఇలా 50 వేల వరకూ మొత్తాల్ని వాపసును త్వరగా ప్రాసెస్ చేసేలా నిబంధనల్లో మార్పు చేస్తున్నారు. అదనంగా కోర్టు లేదా పునరుద్ధరణ ఆదేశాలు లేకపోతే బ్యాంకులు 90 రోజుల్లోపు అలాంటి మొత్తాలపై ఉన్న ఆంక్షల్ని ఎత్తేయాలని కేంద్రం సూచించనుంది. గత ఆరేళ్లలో వివిధ సైబర్ మోసాల కేసుల వల్ల భారతీయులు రూ.52,976 కోట్లకు పైగా కోల్పోయారు.

ఇప్పుడు కేంద్రం తాజాగా తెస్తున్న నిబంధనల ప్రకారం అనుమానాస్పద లావాదేవీపై సైబర్ నేరం ఫిర్యాదు నమోదు చేయబడినప్పుడు బ్యాంకులు, చెల్లింపు అగ్రిగేటర్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, స్టాక్-ట్రేడింగ్ యాప్‌లు, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, ఇతర ఆర్థిక మధ్యవర్తులు అనుసరించాల్సిన విధానాన్ని కేంద్రం నిర్దేశిస్తోంది. మన దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపడటానికి, జాతీయ సైబర్ ఆర్థిక భద్రతా వ్యవస్థను మెరుగుపర్చేందుకు తీసుకున్న ఓ కీలక నిర్ణయంగా దీన్ని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications