Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kamala Harris: కమలా హ్యారిస్ కు మరో గుడ్ న్యూస్..!

అమెరికా అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబర్ లో జరిగే ఎన్నికల రేసు నానాటికీ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మరోసారి పోటీ చేస్తారని భావించిన
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అకస్మికంగా తప్పుకోవడంతో ఇక ట్రంప్ ఏకపక్షంగా ఎన్నికవడం ఖాయమని అంతా భావించారు. అదే సమయంలో ఆయనపై జరిగిన దాడి కూడా ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే బైడెన్ వెళ్తూ వెళ్తూ ట్రంప్ కు షాకిచ్చే ప్రకటన చేశారు.

తన స్ధానంలో ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ పోటీ చేస్తారని, ఆమెకే తన మద్దతంటూ బైడెన్ చేసిన ప్రకటన ట్రంప్ కు తొలి షాకిచ్చింది. ఆ తర్వాత వెలువడిన పలు సర్వేల్లోనూ ట్రంప్ కంటే కమలా హ్యారిస్ కే స్వల్ప మొగ్గు ఉన్నట్లు తేలింది. దీంతో కమల ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు. అదే సమయంలో ఆమెకు ఇవాళ మరో గుడ్ న్యూస్ అందింది. అమెరికా మాజీ అధ్యక్షుడు, నల్లజాతీయుడైన బరాక్ ఒబామా సతీమణి మిషెల్ కూడా తన మద్దతు కమలా హ్యారిస్ కే అని తేల్చిచెప్పేశారు.

michelle Obama supports kamala Harris s US presidential bid

బరాక్ ఒబామా-మిచెల్ దంపతులు , కమలా హ్యారిస్ మధ్య జరిగిన ఓ వీడియో కాల్ లో ఆమె అభ్యర్థిత్వానికి వారు మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో మీ అభ్యర్థిత్వానికి మద్దతిస్తామని, మిమ్మల్ని ఓవల్ ఆఫీసుకు తెచ్చేందుకు తాము చేయగలిగినంత చేస్తామని ఒబామా కమలా హ్యారిస్ కు హామీ ఇచ్చారు. అలాగే కమలా హ్యారిస్ ను చూసి గర్వపడుతున్నట్లు మిషెల్ తెలిపారు. ఇదో చారిత్రాత్మక ఎన్నిక అవుతుందంటూ వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+