ఒబామా జంట విడాకులు ? ట్రంప్ ఈవెంట్ కు మిషెల్ డుమ్మా..!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విడాకులకు సిద్దమవుతున్నారు. రెండుసార్లు అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా తన భార్య మిషెల్ ఒబామాకూ మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఒబామా దంపతుల్ని కూడా ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి రాకూడదని మిషెల్ తీసుకున్న నిర్ణయం వీరిద్దరి విడాకులకు మరో సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు బరాక్ ఒబామా ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు మిషెల్ ఒబామా రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. గత నెల రోజుల వ్యవధిలో ఇలా తన భర్తతో కలిసి అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకుండా మిషెల్ డుమ్మా కొట్టడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిషెల్ ఇలాగే గైర్హాజరు అయ్యారు.వాస్తవానికి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకూడదనే మిషెల్ ఒబామా నిర్ణయం మాజీ అధ్యక్షులు, ప్రథమ మహిళలు సాధారణంగా హాజరయ్యే ఈ సంప్రదాయ వేడుకకు విరుద్ధంగా విశ్లేషకులు చెబుతున్నారు.

బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా జోడీ 1989లో డేటింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత 1992లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కొంతకాలంగా వీరి బంధంలో విభేదాలు మొదలయ్యాయి. అదే సమయంలో మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మాజీ ప్రథమ మహిళ అయిన మిషెల్ హాజరు కాకపోవడం, ఇప్పుడు ట్రంప్ ప్రమాణస్వీకారానికి కూడా రాకపోవడం లేకపోవడం అప్పటికే కొనసాగుతున్న విడాకుల ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
వాస్తవానికి గత కొంతకాలంగా బరాక్ ఒబామా దంపతులు ఎక్కడా బహిరంగంగా కలిసి కనిపించింది లేదు. అప్పుడే వీరిద్దరి విడాకుల ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ప్రచారం కాస్తా ఎప్పటికప్పుడు పెరుగుతూ పోయింది. దీనికి తాజా ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. దీంతో త్వరలో అధికారికంగా వీరు విడాకుల ప్రకటన చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.












Click it and Unblock the Notifications