14 ఏళ్ల హిందూ అమ్మాయి కిడ్నాప్..మత మార్పిడి.. 40ఏళ్ల ముస్లిం వ్యక్తితో పెళ్లి.. పాక్‌లో దారుణం..

ఇస్లామాబాద్/హైదరాబాద్ : పాకిస్థాన్ లో హిందువులపై దాడులు కొనసాగుతుండడమే కాకుండా హిందూ మహిళలు, మైనర్ అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వేలమంది 14 సంవత్సరాల లోపు మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి, ఆపై బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చేస్తున్నారు కొంత మంది మత చాందస వాదులు. అంతేకాదు ఆ అమ్మాయిలకు ముస్లిం యువకులను లేదా, ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు.

అందులో వయసు తారతమ్యం లేకుండా 40-50 ఏళ్ల వయసు వారికి ఈ మతం మార్చిన అమ్మాయిలను ఇచ్చి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లో పద్నాలుగేళ్ల మైనర్ హిందూ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి మతం మార్చారు అక్కడి కొంత మంది పాకిస్థానీయులు.

 Minor Hindu girl converted to Islam, married to Fourty-year-old man in Pak

అంతేకాదు ఆ అమ్మాయిని 40 ఏళ్ల మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తికిచ్చి వివాహం చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు పాక్‌ సోషల్ మీడియాలో చెక్కెర్లు కొడుతున్నాయి. మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తి, సదరు మైనర్‌ బాలికలు కిడ్నాప్‌ చేసి మతం మార్చినట్లు అక్కడ జరిగిన కొన్ని సాక్ష్యాలు నిర్థారిస్తున్నాయి. బాధితురాలి చేతిని పట్టుకుని నిఖాకు సంబంధించిన పేపర్లతో అతను ఫోటో కూడా దిగాడు. అదే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఉదంతంపై పాక్‌ మైనార్టీ సంఘాలు భగ్గుమంటున్నాయి. చిన్న వయసు బాలికలపైనే కాకుండా యువతులపై దాడులను ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఐతే హిందువులు ఎక్కువగా ఉండే సింధ్ ప్రాంతంలో నిత్యం అమ్మాయిల కిడ్నాప్‌ జరగడం సర్వసాదారణంగా మారింది. ఇప్పటికే దాదాపు వేల మంది హిందూ, క్రిస్టియన్‌, సిక్కు యువతులను కిడ్నాప్‌ చేసి ఇస్లాంలోకి మార్చి వివాహాలు చేసుకుంటున్నారు అక్కడి ముస్లిం పాకిస్తాన్ వ్యక్తులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+