వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ వరల్డ్ 2019 విజేత జమైకా భామ, ఫస్ట్ రన్నరప్ ఫ్రాన్స్, సెకండ్ రన్నరప్‌గా సుమన్ రావు...

|
Google Oneindia TeluguNews

ప్రపంచ సుందరి 2019 విజేతలను మిస్ వరల్ట్ కమిటీ శనివారం ప్రకటించింది. ఎక్సెల్ లండన్‌లో వివిధ దేశాలకు చెందిన భామల అభిప్రాయాలను సేకరించి విజేత వివరాలను వెల్లడించింది. జమైకా భామను ప్రపంచ సుందరి కిరీటం వరించింది. భారతదేశానికి చెందిన సుమన్ రావు రెండో రన్నరప్‌గా నిలిచారు.

 మిస్ వరల్డ్ 2019

మిస్ వరల్డ్ 2019

టోని ఆన్ సింగ్ 2019 ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు. కమిటీ ఆమెను మిస్ వరల్డ్‌గా సెలక్ట్ చేసినట్టు ప్రకటించింది. సమావేశ మందిరంలో కరతాళధ్వనుల మధ్య సంతోషంతో ఉబికి వస్తోన్న కన్నిటీకి ఆపుకొని చేయి ఊపారు. 2018 మిస్ వరల్డ్ వన్నెసా పొన్సే.. టోని ఆన్ సింగ్‌కు ప్రపంచ సుందరి కిరీటాన్ని పెట్టారు.

ఫస్ట్, సెకండ్ రన్నరప్..

ఫస్ట్, సెకండ్ రన్నరప్..

ఫ్రాన్స్‌కు చెందిన ఒప్లే మెజినో మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఇండియాకు చెందిన సుమన్ రావు రెండో రన్నరప్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌కి చెందిన సుమన్ రావు (20).. 2019లో మిస్ ఇండియాగా ఎంపికయ్యారు. తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నారు.

చదువుతూనే

చదువుతూనే

సుమన్ రావు గత కొన్ని నెలలుగా మోడలింగ్ చేస్తున్నారు. చదువుకుంటూనే మోడలింగ్ చేయడం విశేషం. 2019లో మిస్ ఇండియాగా గెలుపొందిన తర్వాత లింగ సమానత్వం కోసం పోరాడుతానని సుమన్ రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమిస్తానని ఆమె తెలిపారు.

టాప్-5

టాప్-5

ప్రపంచ సుందరి 2019లో టాప్ ఐదుగురిని ఎంపికచేశారు. వారిలో ఆన్ సింగ్, మెజినో, సుమన్ రావు ఉన్నారు. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ పియర్స్ మోర్గన్ ఐదుగురుని వివిధ అంశాలపై ప్రశ్నించి.. ప్రపంచ సుందరి టోని ఆన్ సింగ్, మొదటి రన్నపర్ ఒప్లే మెజినో, రెండో రన్నరప్‌ సుమన్ రావును ప్రకటించారు.

120 దేశాల నుంచి

120 దేశాల నుంచి

మిస్ వరల్డ్ 2019కి 120 దేశాల నుంచి మహిళలు పాల్గొన్నారు. ఈ ఏడాది నిర్వహించిన పోటీ 69వదని నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 30వ తేదీ నుంచి లండన్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. కొన్ని వారాల తర్వాత టాప్ పది మందిని ఫైనల్‌కు ఎంపికచేశారు.

English summary
tony-Ann Singh of Jamaica was announced as the winner of the Miss World 2019 beauty pageant held at the ExCeL London on December 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X