దేశాధ్యక్షుడి భవనంపై హౌతీల భీకర దాడి: యెమెన్ లో అంతర్యుద్ధం

యెమెన్ లో అంతర్యుద్ధం రాజుకుంది. పోర్ట్ సిటీ ఏడెన్‌లో ఉన్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు భీకర దాడికి దిగారు. అయిదు క్షిపణులను సంధించారు. ఈ ప్యాలెస్ నుంచే యెమెన్ సంకీర్ణ పరిపాలనా నడుస్తోంది. ఇక్కడి ప్రభుత్వానికి సౌదీ అరేబియా అండగా ఉందనే కారణంతో హౌతీలు ఈ దాడికి దిగినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఏడెన్‌లోని క్రేటర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అల్ మాషిక్ ప్యాలెస్ సమీపంలో ఈ క్షిపణులు పడ్డాయి. భారీ శబ్దాలతో కూడిన పేలుళ్లు సంభవించాయి.

ఈ దాడిని యెమెన్ ప్రభుత్వం నిర్ధారించింది. అల్ మాషిక్ ప్యాలెస్ లో ఉన్న యెమెన్ ప్రధానమంత్రి, ఆయన కేబినెట్ సహచరులు సురక్షితంగా ఉన్నారని తెలిపింది. కీలక భేటీ కొనసాగుతున్న సమయంలో ప్యాలెస్ పైకి హౌతీ తిరుగుబాటుదారులు అయిదు క్షిపణులను ప్రయోగించారని సమాచార శాఖ మంత్రి మహ్మద్ అమ్మర్ అల్ ఎర్యానీ తెలిపారు. ఈ హఠాత్ పరిణామాలతో ఏడెన్ సిటీలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Missiles was targeted the Presidential palace housing Yemen blaming the attack on the Houthi in Aden

అల్ మాషిక్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ పరిసర ప్రాంతాల నుండి నల్లటి పొగలు ఆకాశాన్ని ముంచెత్తాయి. పేలుళ్ల ధాటికి సమీప నివాసాలు సైతం కంపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడిలో ఇప్పటివరకు నలుగురు మరణించారు. అధ్యక్షుడి ప్యాలెస్ కు భారీగా నష్టం సంభవించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ప్రభుత్వ ముఖ్య నేతలను లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తోన్నారు.

6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ
6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ

ఈ దాడికి తామే బాధ్యత వహిస్తోన్నట్లు హౌతీలు ప్రకటించుకున్నాయి. ప్యాలెస్ ప్రాంగణంలో సౌదీ అరేబియా మిలిటరీ అధికారులు నిర్వహిస్తున్న సైనిక కార్యకలాపాల కేంద్రం, అక్కడి ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడి చేశామని స్పష్టం చేశాయి. సౌదీ సైనిక దళాలు ఎక్కడ ఉన్నా వారిని లక్ష్యంగా చేసుకోవడమే తమ విధానమని హూతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యా సరి తెలిపారు. ఇందులో భాగంగానే ఏడెన్ లో గల సౌదీ స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసినట్లు చెప్పారు.

బ్రహ్మోత్సవాల వేళ.. టీటీడీ తాజా సూచనలు
బ్రహ్మోత్సవాల వేళ.. టీటీడీ తాజా సూచనలు

ఈ దాడి అనంతరం హూతీ తిరుగుబాటుదారులు అంతర్జాతీయ విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. సౌదీ అరేబియా వైమానిక ప్రాంతంతో పాటు అక్కడి ప్రధాన విమానాశ్రయాలు సురక్షితం కాదని, వాటిపై దాడులు కొనసాగుతాయని అన్నారు. మక్కా, మదీనా వైమానిక మార్గాలకు మాత్రం దాడుల నుండి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+