6జీ ప్రకటించిన జియో: కారు చౌకగా రూ. 4.9కు వన్ జీబీ డేటా: ఆకాష్ అంబానీ

దేశీయ టెలికాం రంగాన్ని శాసిస్తోన్న జియో ప్లాట్‌ఫార్మ్స్.. మరో సంచలనానికి తెర తీసింది. నెక్స్ట్ జెన్ 6జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. నూతనంగా టవర్లు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వంటి ఎలాంటి మౌలిక వసతులను నిర్మించాల్సిన అవసరం లేకుండా.. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ ద్వారానే 6జీ సేవలను అందించబోతోంది. ప్రస్తుతం ఉన్న 5జీ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయడం ద్వారా 6జీకి మారవచ్చు యూజర్లు.

ఈ విషయాన్ని జియో మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ వెల్లడించారు. ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీని ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం జియో వద్ద ఉన్న విస్తృతమైన నెట్‌వర్క్, సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం.. 6జీ సహా భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీ మార్పులకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Jio 6G Vision reveals by Akash Ambani Will Be Rolled Out as Software Upgrade and Jio IPO highlights

దేశవ్యాప్తంగా జియోకు ఉన్న 3.6 లక్షలకు పైగా టవర్లు, 10 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఫైబర్ నెట్‌వర్క్ ఈ అప్‌గ్రేడ్‌కు దోహదపడతాయని వివరించారు. జియో పదేళ్ల ప్రయాణంలో దాదాపు 53 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకోగా, వీరిలో 28.5 కోట్ల మంది 5జీకి మారినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం డిజిటల్ ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతానికి పైగా డేటాను జియో నెట్‌వర్కే మోస్తోందని పేర్కొన్నారు.

ఇన్ కమింగ్ కాల్స్ లో బిగ్ ఛేంజ్: ఇక దాగుడుమూతలకు కేంద్రం చెక్
ఇన్ కమింగ్ కాల్స్ లో బిగ్ ఛేంజ్: ఇక దాగుడుమూతలకు కేంద్రం చెక్

సగటున ఒక వినియోగదారుడు నెలకు 43.7 జీబీ డేటాను ఉపయోగిస్తుండగా, డౌన్‌లోడ్ వేగం దాదాపు 200 ఎంబీపీఎస్‌గా ఉందని వివరించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా రూ. 4.9కు ఒక జీబీ డేటాను అందిస్తోన్నట్లు ఆకాష్ అంబానీ స్పష్టం చేశారు. మొబిలిటీ విభాగంలో భాగంగా 2జీ వినియోగదారులను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త వినియోగదారులను ఆకర్షించడం ద్వారా 34 కోట్ల మంది వినియోగదారుల లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తోన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం మూడు కోట్ల వరకు ఉన్న హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను సమీప భవిష్యత్ లో 10 కోట్ల ఇళ్లకు విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 2016కు ముందు దేశంలో యావరేజ్ డౌన్‌లోడ్ స్పీడ్ 2.5 ఎంబీపీఎస్ ఉండగా, ప్రస్తుతం అది 68 ఎంబీపీఎస్‌కు పెరిగిందని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. జియో సగటు 5జీ డౌన్‌లోడ్ స్పీడ్ 198.9 ఎంబీపీఎస్‌గా నమోదైందని, ఇది ఇతర టెలికాం సంస్థల వేగం కంటే దాదాపు రెట్టింపని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+