ప్రాణాన్ని ఫణంగా పెట్టి.. ప్రమాదం అంచున.. ఓ మోడల్ డేరింగ్ స్టంట్

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: 70 అంతస్తులకు పైగా ఉన్న భవనం ఎక్కి మామూలుగా కిటికీలోంచి కిందికి చూస్తేనే మనకు కళ్లు తిరుగుతాయి. అలాంటిది అంత ఎత్తు నుంచి కేవలం ఒక చెయ్యి అధారంగా వేలాడడం అంటే.. వామ్మో.. మన వల్ల కాదు అనిపిస్తుంది.

కానీ ఇన్ స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిన ఓ రష్యన్ మోడల్ మాత్రం ఈ ఫీట్ చేసి 'వారెవా 'అనిపించింది. రష్యన్ మోడల్ వికీ ఒడింక్టోవా చేసిన ఓ డేరింగ్ స్టంట్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. దుబాయ్ లోని 70 అంతస్తుల కాయన్ టవర్ పై ఒడింక్టోవా ఈ స్టంట్ చేసింది.

ఆ భవనంపై నుంచి వేలాడుతూ ఆమె ఫొటోలకు పోజిచ్చింది. ఆమెకున్న ఏకైన ఆధారం, రక్షణ.. డైరెక్టర్ అలెగ్జాండర్ టికోమిరోవ్ చేయి మాత్రమే. అతడు ఆమె చేతిని పట్టుకోగా.. ఆమె మరే ఆధారం లేకుండా గాలిలో వేలాడుతూ అద్భుతమైన ఫొటోకు పోజిచ్చింది.

Full video (link in bio)! @a_mavrin #MAVRINmodels #MAVRIN #VikiOdintcova #Dubai

A post shared by Viki Odintcova (@viki_odintcova) on Feb 3, 2017 at 7:12am PST

ఇద్దరిలో ఎవరి పట్టు ఏమాత్రం తప్పినా జరగబోయే ఘోర ప్రమాదం గురించి ఊహించడానికి కూడా భయమే. మొత్తం ఈ వ్యవహారాన్ని వీడియో కూడా తీసి దాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అక్కడ ఆమెకు 32 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

నిజానికి ఈ ఫొటో షూట్ గత ఏడాది డిసెంబర్ 29న తీసినది. అప్పట్నించి దీనికి లక్షకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫొటో షూట్ కి సంబంధించి ఆ డేరింగ్ స్టంట్ తాను ఎలా చేసిందో చూపే వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫొటోపై మళ్లీ చర్చ మొదలైంది.

వికీ ఒడింక్టోవా డేరింగ్ స్టంట్ కి సంబంధించిన వీడియో మాత్రం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే దీనిని 4.2 లక్షల మంది చూడగా.. 99 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. గతంలో తన వీడియోలకు సంబంధించిన 'బిహైండ్ ద సీన్స్ ' క్లిప్పింగ్ లను కూడా ఒడింక్టోవా షేర్ చేసింది. దీనికి ఇప్పటి వరకు పది లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం.

అయితే ఒడింక్టోవా ఫొటో షూట్ ఆమెకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా తెచ్చిపెట్టింది. ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఇలాంటి సాహసం చేస్తావా? జీవితం పట్ల మరీ ఇంత నిర్లక్ష్యమా? అంటూ చాలా మంది నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
We have heard of models shedding calories hitting the gym, being on diet to get that perfect look as they want to standout in a photoshoot. But a latest photoshoot by a 22-year-old model is spine-chilling. Russian model Viki Odintcova almost did a death-defying photoshoot by dangling from a 1,004-foot tall Cayan Tower in Dubai. In one the photoshoot, she lent backwards from a ledge with the help of a stunt man. She posted a series of photos and snippets of her scary shoot on her Instagram account.
Please Wait while comments are loading...