ఔను! నా కూతురు హైదరాబాద్ వస్తోంది: ట్రంప్, ఇవాంకా ఇలా..

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: తన కూతురు హైదరాబాద్ వస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నవంబర్ 28 నుంచి జరగబోయే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు తన కూతురు ఇంకా హాజరవుతుందని తెలిపారు.

'అమెరికా ప్రతినిధుల బృందానికి ఇవాంకా ట్రంప్ నేతృత్వం వహిస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తల ప్రాతినిథ్యానికి సంకేతంగా ఉంటుంది' అని ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. కాగా, ఈ సదస్సుకు ఇవాంకా హాజరవుతున్నట్లు గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో ప్రకటించిన కొద్దిగంటలకే ట్రంప్ ఈ మేరకు స్పందించారు.

US President Donald Trump walks up to PM Modi for impromptu chit-chat | Oneindia Telugu

ఇది ఇలా ఉండగా, తన భారత పర్యటనపై ఇవాంకా ట్రంప్ కూడా స్పందించారు. అమెరికా ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించడం, ప్రధాని మోడీని కలుసుకోబోతుండటం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఇవాంకా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 35ఏళ్ల ఇవాంకా ప్రస్తుతం తన తండ్రి ట్రంప్‌కు సలహాదారుగా ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India and the United States on Thursday announced the schedule for their first joint global entrepreneurship summit in November via tweets by Prime Minister Narendra Modi and President Donald Trump.
Please Wait while comments are loading...