Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ టాప్ కమాండర్ హతం

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్​-ఇరాన్​ల యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆ దేశ టాప్ కమాండర్ మహమ్మద్ పక్ పూర్ హతం అయినట్లు సమాచారం. అలాగే ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చీఫ్ ముహమూర్ బగేరీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేనీ సలామీ.. వీరితోపాటు ఆర్మీ చీఫ్‌ అమీర్ హతామీ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఈ దాడుల్లో మృతి చెందలేదని ఇరాన్ వెల్లడించింది.

ఇజ్రాయెల్​-ఇరాన్​ ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇజ్రాయెల్ తాజాగా జరిపిన క్షిపణి దాడుల్లో ఇరాన్ కు చెందిన టాప్ కమాండర్, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ పక్‌ పూర్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. పక్ పూర్ గతనెలోనే ఇజ్రాయెల్, అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ , అమెరికా నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురైనా తక్షణం స్పందించేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉంటుందని.. గన్ ట్రిగ్గర్ పై వేలు ఎప్పుడూ ఉంటుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

ఇక మహమ్మద్ పక్‌ పూర్ గతంలో IRGC గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్‌ గా విధులు నిర్వర్తించారు. అయితే 2025లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అప్పటి కమాండర్ హొస్సేన్ సలామీ హతం అయిన నేపథ్యంలో పక్‌ పూర్‌ ను IRGC కొత్త చీఫ్‌ గా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నియమించారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ కమాండర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.

MohammadPakpour Senior IRGC Commander of iran was Killed by Israeli Strikes Escalation Alert

మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో దక్షిణ ఇరాన్ లోని బాలికల పాఠశాల పూర్తిగా దగ్ధం అయినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడిలో దాదాపు 30 మందికి పైగా చిన్నారులు మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్​ఎన్​ఏ తాజాగా వెల్లడించింది. అలాగే యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇజ్రాయెల్​, ఇరాన్​, ఇరాక్​, కువైట్​, బహ్రెయన్​, ఖతార్​ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+