కదులుతున్న బస్సులో యువకుడి ప్యాంట్ లాగేసింది(వీడియో)

Subscribe to Oneindia Telugu

బీజింగ్: బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి ఘోర అవమానం జరిగింది. బస్సులో నిలబడి ప్రయాణిస్తున్న ఆ యువకుడిని ప్యాంటును ఓ యువతి హఠాత్తుగా లాగేసింది. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడా యువకుడు.

వెంటనే అతడు సర్దుకున్నాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎలాగంటే.. ఈ ఉదంతమంతా బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అంతేగాక, ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అసలు జరిగిన విషయం ఏమిటంటే.. కదులుతున్న బస్సులో ఓ యువతి తన హ్యాండ్ బ్యాగులోని వస్తువులు కిందపడేసుకుంది. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో యువతి బ్యాలెన్స్ తప్పి.. అదుపు చేసుకునే క్రమంలో అక్కడే నిల్చున్న యువకుడి ప్యాంటు పట్టుకుంది.

అదికాస్తా జారిపోవటంతో ఆ యువతి కిందపడక తప్పలేదు. ఏదేమైనా ఓ అమాయక పురుషుడి పరువు ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా పోయిందంటూ పలువురు నెటిజన్లు అతడికి మద్దతు పలుకుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Moment a woman A man has been caught with down in the city of Fuzhou, south east China.In an unfortunate moment the shorts were dragged to his feet when a woman fell over and reached out for something to latch onto.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి