వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో బయటపడ్డ అరుదైన 'మంకీ పాక్స్'... గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలి కేసు...

|
Google Oneindia TeluguNews

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో అరుదైన 'మంకీ పాక్స్' వ్యాధి బయటపడింది. కొద్దిరోజుల క్రితం నైజీరియా నుంచి తిరిగొచ్చిన టెక్సాస్‌కి చెందిన ఓ వ్యక్తిలో ఈ వ్యాధి బయటపడింది. ప్రస్తుతం డల్లాస్‌లోని ఓ ఆస్పత్రిలో అతన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం అతని కాంటాక్ట్స్‌ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అతనితో పాటు విమాన ప్రయాణం చేసినవారిని,ఇటీవల అతన్ని కలిసినవారిని గుర్తించనున్నారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ఈ వివరాలు వెల్లడించింది.

మంకీపాక్స్-బయటపడ్డ మరో అరుదైన వైరస్-అసలేంటీ వ్యాధి,లక్షణాలేంటి,చికిత్స ఉందా...?మంకీపాక్స్-బయటపడ్డ మరో అరుదైన వైరస్-అసలేంటీ వ్యాధి,లక్షణాలేంటి,చికిత్స ఉందా...?

చివరిసారిగా 2003లో...

చివరిసారిగా 2003లో...


చివరిసారిగా 2003లో అమెరికాలో మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి. అప్పట్లో 47 మందికి ఈ వ్యాధి సోకింది. మిడ్‌వెస్ట్‌ ప్రాంతంలోని పెంపుడు కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు.మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మంకీ పాక్స్ కేసు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే దీని గురించి అంతగా ఆందోళన చెందనక్కర్లేదని... దీనివల్ల సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. సీడీసీ ప్రకారం 100లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఎలా వ్యాప్తి చెందుతుంది...

ఎలా వ్యాప్తి చెందుతుంది...

మంకీ పాక్స్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా,దగ్గినా గాలి ద్వారా ఇది ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి బారినపడినవారిలో జ్వరం,ముఖం ,శరీర భాగాలపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాదాపుగా 2-4 వారాల్లో ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. మశూచి తరహా లక్షణాలకు ఈ లక్షణాలు దగ్గరగా ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం... రక్తం,శరీర స్రావాలు,జంతువుల గాయాల ద్వారా మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతుంది. అర్థోపోక్స్‌వైరస్ అనే జాతికి చెందిన వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

ఆఫ్రికా దేశాల నుంచే వ్యాప్తి...

ఆఫ్రికా దేశాల నుంచే వ్యాప్తి...


సాధారణంగా పశ్చిమాఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటుంది. 1970లో మొదటిసారిగా కాంగోలో ఈ వ్యాధి బయటపడింది. ఇప్పటివరకూ పశ్చిమాఫ్రికాతో పాటు సెంట్రల్ ఆఫ్రికాలోని 9 దేశాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఇటీవలే యూకెలోని నార్త్ వేల్స్‌లోనూ మంకీ పాక్స్ కేసులు నమోదైంది. నైజీరియా నుంచే ఈ వ్యాధి వ్యాప్తి చెందిందన్న అనుమానాలు ఉన్నాయి. 2018 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌‌కు,డిసెంబర్ 2019లో యూకె దేశాలకు,మే 2019లో సింగపూర్ దేశాలకు మంకీ పాక్స్ వ్యాప్తి చెందింది.

వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్

వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్

మంకీ పాక్స్ వ్యాధి ఏ జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నది నిర్దారించేందుకు ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే దీనికి ప్రత్యేకించి ఏ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. స్మాల్ పాక్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే జిన్నియోస్ వ్యాక్సిన్ మంకీ పాక్స్ నుంచి రక్షణ కల్పించగలదని అంచనా వేస్తున్నారు. కాంగోలో ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

English summary
Almost two decades later, a rare 'monkey pox' disease has emerged in America. A man from Texas who returned from Nigeria a few days ago contracted the disease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X