Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డొనాల్డ్ ట్రంప్- ముఖేష్- నీతా అంబానీ: క్యాండిల్ లైట్ డిన్నర్

Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొక్క రోజు మాత్రమే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

రేపే గ్రాండ్‌గా..

ప్రమాణ స్వీకారం చేయడానికి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5:20 నిమిషాలకు భార్య మెలానియా, కుమారుడు బారోన్ ట్రంప్‌తో కలిసి ఇక్కడి డల్లెస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా నార్త్ వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు బయలుదేరి వెళ్లారు.

Mukesh Ambani and Nita Ambani congratulated Donald Trump in a Private Reception

ప్రీ- సెలబ్రేషన్స్‌లో..

ఇక్కడ ప్రీ- సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు. ఇక్కడ సంబరాలు అద్దిరిపోయాయి. ఆకాశాన్నంటేలా బాణాసంచాను కాల్చారు. భార్య మెలానియా ట్రంప్, కుమారుడు బరోన్, కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నెర్‌తో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు.

ఆహ్వానితులకు గ్రాండ్ పార్టీ..

అనంతరం తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్న ఆహ్వానితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. వాషింగ్టన్ డీసీలో ఈ ప్రైవేట్ రిసెప్షన్ ఏర్పాటైంది. అమెరికా సహా వేర్వేరు దేశాల నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, కార్పొరేటర్ అధినేతలు, సెలెబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు.

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ..

ఈ కార్యక్రమానికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చీఫ్ నీతా అంబానీ హాజరయ్యారు. డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్- అమెరికా వాణిజ్య, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికీ

డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ రెండు దేశాలు- ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలవాలని, ఆర్థిక పురోగతిని సాధించాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికీ అంబానీ దంపతులు హాజరుకానున్నారు.

క్యాండిల్‌ లైట్ డిన్నర్‌..

ట్రంప్‌తో కలిసి క్యాండిల్‌ లైట్ డిన్నర్‌కు హాజరు కావడానికి ఎంపిక చేసిన వంద మంది ఆహ్వానితుల్లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఉన్నారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్.. ఈ క్యాండిల్ లైట్ డిన్నర్‌కు వేదిక. ఈ డిన్నర్‌‌లో పాల్గొనదలిచిన వారి నుంచి ఫీజును వసూలు చేసింది అమెరికా ప్రభుత్వం.

ఫండ్ రైజింగ్ కింద..

ఫండ్ రైజింగ్ కింద ఈ ఎంట్రీ ఫీజును నిర్ధారించింది. 50 వేల నుంచి ఒక మిలియన్ డాలర్ల వరకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. దీని ద్వారా అందిన మొత్తాన్ని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఖర్చు చేస్తారు. భారత్ నుంచి ఎంపికైన వాళ్లు అంబానీ దంపతులు మాత్రమే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+