రాజ్ నాథ్ సింగ్ 'బ్రహ్మోస్' వ్యాఖ్యలకు అసిమ్ మునీర్ కౌంటర్
భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల పాకిస్థాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ లోని ప్రతి ఇంచు కూడా బ్రహ్మోస్ క్షిపణి అధీనంలో ఉందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మరోసారి ప్రస్తావించారు. బ్రహ్మోస్ క్షిపణి శక్తిని మరోసారి ప్రపంచానికి తెలియజేశారు. అయితే రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కౌంటర్ ఇచ్చారు. తమ దేశ సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఇండియన్ ఆర్మీ పాల్పడినా చూస్తూ ఊరుకోమని తెలిపారు.
రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ బ్రహ్మోస్ క్షిపణి వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి ఇంచు బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ లో భారత్ విజయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే తాజాగా రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్పందించారు. తమ దేశ సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. జనరల్ హెడ్ క్వార్టర్స్ లోని 17 వ నేషనల్ వర్క్ షాప్ బలూచిస్థాన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడినా తక్షణ చర్యలు ఉంటాయని అన్నారు.
అలాగే తమ దేశ అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని అసిమ్ మునీర్ స్పష్టం చేశారు. ఇక ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. ఈ దాడుల వెనకాల ఉన్నట్లు తేలిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని 9 కీలక ఉగ్రవాద సంస్థలపై దాడులు నిర్వహించింది. వాటిని ధ్వంసం చేసింది. అలాగే ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్ర మూకలను హతమార్చింది.

ఇదే విషయంపై ఇటీవల రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఉత్తర్ ప్రదేశ్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. బ్రహ్మోస్ కేవలం ఓ యంత్రం కాదని.. దాని పనితనం, ప్రతిభ ప్రపంచానికి తెలిసింది అని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తో విజయం తమకు చిన్న ఘటన కాదని.. అదో అలవాటు అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. మన దేశం పూర్తిగా విశ్వాసంతో ఉంది.. మన శత్రువులు బ్రహ్మోస్ నుంచి తప్పించుకోలేరు. అదే పాకిస్థాన్ విషయానికి వస్తే పాకిస్థాన్ లోని ప్రతి ఇంచు బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉంది.. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే.. అది పాకిస్థాన్ కు అర్థమైంది.. అని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications