Video : మసీదులో ప్రార్ధనలు చేయిస్తున్న ఇమామ్ పై హఠాత్తుగా దాడి...
యూఎస్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. న్యూజెర్సీలోని ఓ మసీదులో రంజాన్ సందర్భంగా ప్రార్ధనలు చేయిస్తున్న ఓ ఇమామ్ (ప్రార్ధనలు చేయించే మతగురువు)పై అకస్మాత్తుగా ఓ అంగంతకుడు దాడికి దిగాడు. ఈ దాడిలో సదరు ఇమామ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నమాజ్ చేస్తున్న వారు అప్రమత్తమై అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ముస్లింలు అధికంగా ఉండే న్యూజెర్సీలో కలకలం రేపింది.
న్యూజెర్సీలోని సౌత్ ప్యాటర్సన్‌లో ఉన్న ఒమర్ మసీదులో సుమారు 200 మంది భక్తులు ప్రార్థన కోసం మోకరిల్లారు. ఈ సమయంల ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇమామ్ సయ్యద్ ఎల్నాకిబ్ ఘటన జరిగిన సమయంలో ప్రార్థనలు చేయిస్తున్నారు. అ సమయంలో మసీదులోకి చొరబడిన ఓ అగంతకుడు ఆయన్ను అనేకసార్లు కత్తితో పొడిచాడు. దీంతో వెంటనే ఆయన కుప్పకూలారు. నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు వచ్చి అరెస్టు చేసే లోపే భక్తులు అతడిని పట్టుకున్నారు. దాడి వెనుక ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

ఈ దాడి తరువాత మేయర్ ఆండ్రీ సాయెగ్ ఇమామ్ ఆరోగ్యం నిలకడగా ఉందని మరియు ఊపిరితిత్తుల పంక్చర్‌తో చికిత్స పొందుతున్నారని ధృవీకరించారు. ఈ ఘటన ఒంటరిగా జరిగిందని, మసీదు సురక్షితంగా ఉందని మసీదు అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలోని మసీదుల వద్ద పోలీసు పహారా పెంచుతున్నట్లు ప్యాటర్సన్ అధికారులు ప్రకటించారు.
The imam of Omar Mosque in New Jersey has been stabbed during the prayer on Sunday, 9th of April. The suspect is a man named Serif Zorba. Zorba was caught by the congregation as he tried to escape. The motive of the attacker is still unknown. https://t.co/mJA8Bp4aam pic.twitter.com/QY9ONfb9iC
— Sangar Paykhar - سنګر پیکار (@paykhar) April 10, 2023
యూఎస్ లో తలసరి ముస్లిం జనాభా అత్యధికంగా న్యూజెర్సీలోనే ఉంది. ఈ రాష్ట్రం అనేక మసీదులు, ఇస్లామిక్ కేంద్రాలకు నిలయంగా ఉంది. ఇలాంటి ప్రాంతంలో ఇమామ్ పై జరిగిన ఈ దాడి కలకలం రేపుతోంది. ఈ దాడి వెనుక కారణాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ లోపు ముస్లింలు ప్రశాంతంగా ఉండాలని మత పెద్దలు కోరుతున్నారు.
-
అల్లం టీ Vs లెమన్ టీ..ఎవరికి ఏది మేలు చేస్తుంది..!! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications