సముద్రతీరంలో ఏలియన్ల సైన్యం! భూమిపై అటాక్ జరగనుందా?!
పసిఫిక్ సముద్రతీరంలో ఏలియన్ బేస్ కు సంబంధించి సెక్యూర్ టీం 10 అనే వెబ్ సైట్ ప్రచురించిన చిత్రాలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద అలజడి సృష్టిస్తున్నాయి.
కాలిఫోర్నియా: పసిఫిక్ సముద్రతీరంలో ఏలియన్ సైన్యానికి చెందిన బేస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోంది. కాలిఫోర్నియాకు చేరువలోని పసిఫిక్ తీరంలో ఇందుకు సంబంధించిన చిత్రాలను సెక్యూర్ టీం 10 అనే వెబ్ సైట్ ప్రచురించింది.
ఈ ఏలియన్ బేస్ విస్తీర్ణం దాదాపు 2 మైళ్లకు పైగా ఉందని ఆ చిత్రాలను పరిశీలించిన నిపుణులు పేర్కొంటున్నారు. ఏలియన్లు అటుగా ప్రయాణించి ఉండొచ్చని లేదా భవిష్యత్తులో భూమిపై దాడికి వ్యూహ రచన కోసం వచ్చి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
పసిఫిక్ మహాసముద్రంలో తలదాచుకుంటూ ఈ వ్యూహాన్ని వారు కొనసాగిస్తూ ఉండొచ్చని కూడా మరికొందరు పేర్కొంటున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఈ ఏలియన్స్ గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ విశ్వాంతరాళంలో మరో జీవి కచ్చితంగా ఉందని, వారు సాంకేతికంగా మనకంటే ఎన్నో రెట్లు ముందున్నారని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే భూమ్మీద అప్పుడప్పుడూ గుర్తుతెలియని ఎగిరే పళ్లాలు(యూఎఫ్ఓ) కనిపిస్తున్న విషయమూ విదితమే.
ఇప్పుడు సెక్యూర్ టీం 10 సంస్థ ఫొటోలు, వీడియోలు ఇందుకు ధ్రువీకరణగా చూపిస్తోంది. ఇదేగనుక నిజమైతే మన భూమికి, భూమ్మీద నివసిస్తున్న మనకు ఎప్పటికైనా ప్రమాదం తప్పదన్నది నిర్వివాదాంశం.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications