వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణ గ్రహంపై దిగిన నాసా పంపిన మార్స్ హెలికాప్టర్ ఇంజెన్యూటీ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా)కు ఇంజెన్యూటీ మినీ హెలికాప్టర్ మార్స్‌పై దిగింది. ఫిబ్రవరి 18న మార్స్‌పై ల్యాండైన పర్సీవరెన్స్ రోవర్ కింది భాగంలో ఈ మినీ హెలికాప్టర్ ను అమర్చారు. 47 కోట్ల కిలోమీటర్ల పాటు నాసా పర్వీవరెన్స్ రోవర్ తోపాటు ప్రయాణం చేసిన ఈ మినీ హెలికాప్టర్.. ఆదివారం రోవర్ ఉదర భాగం నుంచి మార్స్ ఉపరితలపైన దిగింది.

Recommended Video

NASA's Mars Helicopter Ingenuity Touches Down On Red Planet

ఆ హెలికాప్టర్ ఈ రాత్రి మనుగడ సాగించడమే తర్వాత లక్ష్యం అని నాసాకు చెందిన జెట్ ప్రపల్టన్ లేబోరేటరీ(జేపీఎల్) ఆదివారం ట్వీట్ చేసింది. హెలికాప్టర్ మార్స్ పై దిగిన ఫొటోను పర్వీవరెన్స్ తీసి పంపింది.

 NASAs Mars helicopter Ingenuity touches down on the Red Planet

ఇప్పటి వరకు పర్సీవరెన్స్ పవర్ సిస్టంను ఉపయోగించుకుంటున్న ఈ హెలికాప్టర్ ఇక
తన సొంత బ్యాటరీ సాయంతో మనుగడ సాగించాల్సి ఉంటుంది. అరుణ గ్రహంపై రాత్రి వేళల్లో మైనస్ 90 డిగ్రీ సెల్సియస్ వరకూ కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అలాంటి వాతావరణంలో ఇది మనుగడ సాగించడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇందులోని హీటర్ హెలికాప్టర్‌కు 7 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ అందిస్తుంది.

కాగా, వచ్చే రెండు రోజులపాటు ఇంజెన్యూటీ టీం ఈ హెలికాప్టర్ సోలార్ ప్యానెల్స్ ను తనిఖీ చేయనుంది. అనంతరం బ్యాటరీని రీఛార్జ్ చేసి, తొలిసారి ఎగిరే ముందు మోటార్లు, సెన్సార్లను పరిశీలించనుంది. ఏప్రిల్ 11న ఈ హెలికాప్టర్ తొలిసారి ఎగిరే ప్రయత్నం చేయనుంది.

భూమి సాందరతలో కేవలం 1 శాతం మాత్రమే ఉన్న అరుణగ్రహంపై ఇది ఎగరడం కష్టసాధ్యమైనపనే. అదే సమయంలో భూమి గురత్వాకర్షణ శక్తిలో మూడో వంతు మాత్రమే మార్స్ పై గురుత్వాకర్షణ శక్తి ఉండటం ఇది ఎగరడానికి సాయం చేస్తుంది. తొలి ప్రయత్నంలో భాగంగా పది అడుగుల మేర పైకి ఎగిరి, 30 సెకన్లపాటు అక్కడేవుండి తిరిగి కిందికి రానుంది. దీంతో అక్కడి వాతావరణ పరిస్థితుల సమాచారం మరింత తెలిసే అవకాశం ఉంది.

English summary
NASA's Mars helicopter Ingenuity touched down on the surface of the Red Planet after being dropped by its mother ship, the Perseverance rover, the space agency announced late Saturday (April 4). The helicopter's first flight is just over a week away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X