వెనిజులాపై విరుచుకుపడుతున్న యూఎస్: జట్టుకట్టిన లాటిన్ అమెరికా..!!

వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంజా విసిరారు. వైమానిక దాడులతో విరుచుకుపడ్డారు. రాజధాని కారకాస్ పై బాంబులను కురిపించారు. నగరం చుట్టూ పేలుళ్లు నమోదయ్యాయి. మొత్తం ఏడు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. బాంబు మోతలతో దద్దరిల్లిపోతోందా సిటీ. దీనికితోడు నగరం గగనతలంపై తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు కొట్టిన శబ్దాలు వినిపించాయి. వెనిజులా ప్రధాన సైనిక స్థావరంతో పాటు నగర దక్షిణ ప్రాంతంలో విద్యుత్ సరఫరా అర్ధాంతరంగా నిలిచిపోయింది.

ఆ దేశ కాలమానం ప్రకారం.. వేకువ జామున 2 గంటల సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నగరం మొత్తం అట్టుడికిపోతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థిలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, కంటి మీద కునుకు లేని పరిస్థితిని ఎదుర్కొంటోన్నారు. దీనికి గల కారణాలు ఏమిటనేది ఇంకా మొదట్లో స్పష్టంగా తెలియరాలేదు గానీ.. ఆ తర్వాత అమెరికా ఈ దాడులకు పాల్పడినట్లు వెనిజులా ప్రకటించింది.

National Emergency Declares in Venezuela after US Strikes

ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికాపై నిప్పులు చెరిగారు. వ్యూహాత్మక వనరులు- ముఖ్యంగా చమురు, ఖనిజాలను ఆక్రమించాలనే ఉద్దేశంతో అమెరికా ఈ ఈ దాడులకు పాల్పడిందని మదురో ఆరోపించారు. దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అన్ని జాతీయ రక్షణ ప్రణాళికలను సకాలంలో, తగిన పరిస్థితులలో అమలు చేయాలని ఆదేశించారు. ఈ సామ్రాజ్యవాద దాడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని దేశంలోని అన్ని సామాజిక, రాజకీయ శక్తులకు పిలుపునిచ్చారు.

ఇటువంటి దురాక్రమణ అంతర్జాతీయ శాంతి, స్థిరత్వానికి, ప్రత్యేకించి లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాలకు పెను ముప్పుగా అభివర్ణించారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెనిజులాలో పాలన మార్పు కోసం అమెరికా చేస్తున్న ఈ యుద్ధ ప్రయత్నం గతంలో చేసిన ప్రయత్నాల మాదిరిగానే విఫలమవుతుందని మదురో స్పష్టం చేశారు. 1811 నుండి ఇటువంటి ఆక్రమణలను వెనిజులా ధీటుగా ఎదుర్కొని ఓడించిందని గుర్తు చేశారు.

రాజధాని కరాకాస్‌తో పాటు మిరాండా, అరాగ్వా, లా గ్వైరా రాష్ట్రాల్లో సైనిక, పౌర సంస్థలపై దాడులు జరిగాయని వెనిజులా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడులను పలు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాలు తప్పుపట్టాయి. కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలు స్పందించాయి. అమెరికా దాడులు సరికావని తేల్చి చెప్పారు. అటు క్యూబా కూడా అమెరికా సైనిక చర్యపై విమర్శలు గుప్పించింది. తక్షణమే ఈ దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+