ట్రంప్ షాకులతో రూటు మార్చిన మోడీ..! బాంబుపేల్చిన నాటో ఛీఫ్..!
రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధానికి ఆ దేశానికి పరోక్షంగా సాయం చేస్తున్నారనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం మేర సుంకాలు విధించారు. దీంతో భారత్ విలవిల్లాడుతోంది. దీనికి విరుగుడుగా ఆత్మనిర్భర్ భారత్ ను ప్రోత్సహించాలని కేంద్రం పిలుపునిస్తున్నా అమెరికా సుంకాల ప్రభావం తగ్గుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ప్రధాని మోడీ ఏం అడిగారో నాటో ఛీఫ్ వెల్లడించారు.
రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా భారీ సుంకాలు విధించి ఒత్తిడి పెంచుతున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తున్న ప్రధాని మోడీ.. ఈ విషయంలో పునరాలోచనలో పడ్డారా అన్న చర్చ జరుగుతోంది. రష్యా చమురు కొనుగోలు చేయడం ఆపితే ఏం అడిగితే అది చేస్తాం అంటూ అమెరికా నుంచి ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పుతిన్ కు కాల్ చేశారు. ఉక్రెయిన్ యుద్దం విషయంలో మీ ఆలోచన ఏంటని పుతిన్ ను అడిగారని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే వెల్లడించారు.

ఓవైపు రష్యా చమురు కొంటున్నామనే కారణంతో అమెరికా సుంకాల్ని భరించాల్సి వస్తున్న నేపథ్యంలో దీనంతటికీ కారణమైన ఉక్రెయిన్ యుద్ధంపై మీ వ్యూహం ఏంటో చెప్పాలని ప్రదాని మోడీ పుతిన్ ను అడిగినట్లు నాటో ఛీఫ్ తెలిపారు. అయితే దానికి పుతిన్ ఏం సమాధానం చెప్పారో మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే ఉక్రెయిన్ వార్ విషయంలో వెనక్కి తగ్గేందుకు పుతిన్ సిద్దంగా లేరని మాత్రం తెలుస్తోంది. దీంతో అమెరికా సుంకాల మోత విషయంలో మోడీ ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు.

ఉక్రెయిన్ వార్ విషయంలో పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా .. ఇప్పటికిప్పుడు దాన్ని ఆపేందుకు పలు ప్రతిపాదనలు చేస్తోంది. ఇందులో తాము ఇప్పటికే స్వాధీనం చేసుకున్న భూభాగాల్ని తమ వద్దే ఉంచుకునేందుకు మొగ్గు చూపుతోంది. అలాగే మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం మాత్రం రాలేదు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోతే తమకు పరువు తక్కువని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో భారత్ పై, తద్వారా రష్యాపైనా ఒత్తిడి పెంచుతున్నారు.












Click it and Unblock the Notifications