Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రస్సెల్స్ లో నాటో దేశాల అత్యవసర భేటీ-జో బైడెన్ హాజరు-రష్యాపై తేల్చేస్తారా ?

రష్యా-ఉక్రెయిన్ పోరు నెల రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాజా పరిస్ధితిపై చర్చించేందుకు నాటో దేశాల నేతలు ఇవాళ బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్ లో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఇతర నాటో దేశాల అధినేతలు దీనికి హాజరయ్యారు. రష్యాపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ అత్యవసర భేటీలో నాటో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో పాటు నాటో, జీ7 దేశాల నేతలు యూరోపియన్ కౌన్సిల్‌తో అత్యవసర చర్చల కోసం బ్రస్సెల్స్ కు చేరుకున్నారు. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌తో కలిసి ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర విషయంలో అంతర్జాతీయంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చలకు సిద్ధమవుతున్నారు. చర్చలకు ముందు, స్టోల్టెన్‌బర్గ్ నాయకులు ఈ సంక్షోభాన్ని కలిసి పరిష్కరిస్తారని ప్రకటించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఒక తరంలో అత్యంత తీవ్రమైన భద్రతా సంక్షోభంగా ఆయన అభివర్ణించారు.

nato leaders including joe biden met in brussels to discuss on russia-ukraine war

యూరోపియన్ కౌన్సిల్ తో నాటో దేశాలు, జీ7 దేశాధినేతల భేటీ తర్వాత ఉక్రెయిన్ విషయంలో, రష్యాపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఓ నిర్ణయం వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లో రసాయన, అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధమవుతుందన్న అంచనాల నేపథ్యంలో చేపట్టాల్సిన ప్రతి చర్యలపై ఈ దేశాలు చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉత్తర కొరియా 2017 తర్వాత తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీనిపై జపాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రపంచం ఉక్రెయిన్‌పై దృష్టి సారించిన సమయంలో కొరియా ఆయుధ కార్యక్రమం కారణంగా పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని జపాన్ విమర్శిస్తోంది. జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా కొరియా ప్రయోగించిన క్షిపణి ఓ కొత్త రకమైన ఐసీబీఎం అని భావిస్తున్నట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+