శివుడి రూపంలో ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్‌లో దుమారం: చర్యలకు హిందూ ప్రతినిధుల డిమాండ్

Posted By:
Subscribe to Oneindia Telugu

కరాచీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను ఓ హిందూ దేవుడి రూపంలో చిత్రీకరించడం పాకిస్తాన్‌లో దుమారం రేపుతోంది. ఈ అంశాన్ని హిందూ చట్ట సభ ప్రతినిధులు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో లేవనెత్తారు.

దీంతో అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఫోటోను సృష్టించిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫోటోను ఉపయోగించు సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలు వ్యాప్తి చెందుతున్నాయని హిందూ ఎంపీలు నేషనల్ అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు.

Nawaz Sharif fans reimagine Imran Khan as Lord Shiva, Pakistani Hindus demand action

దీంతో స్పీకర్ సర్దార్ ఆయాజ్ సాదిక్ దీనిపై విచారణ జరపాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్‌ను శివుడి రూపంలో చిత్రీకరించారు. ఈ ఫోటో నెట్లో వైరల్ అయింది. ఈ ఫోటోను ఎంపీ రమేష్ లాల్ నేషనల్ అసెంబ్లీ ముందు ఉంచారు.

ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. కాగా, ఇమ్రాన్‍‌కు ఎప్పటి నుంచో హిందూ సామాజిక వర్గం నుంచి మద్దతు ఉంది. పార్టీలోని సోషల్ మీడియా వింగ్ ఒకటి దీనిని వాడుకొని ప్రచారం చేసినట్లు పార్టీ వైస్ చైర్మన్ షా ముహమూద్ ఖురేషీ వెల్లడించారు. నవాజ్ షరీఫ్ అభిమానులు ఇలా చేశారని కూడా అంటున్నారు.

కాగా, గతంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశం విడిచి వెళ్లిన హిందువులు తిరిగి పాకిస్తాన్ చేరుకోవచ్చని పేర్కొన్నారు. పాక్‌లో హిందూ, కలాష్ వర్గీయులను బలవంతంగా మతమార్పిడులకు గురి చేయడం పట్ల కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nawaz Sharif fans reimagine Imran Khan as Lord Shiva, Pakistani Hindus demand action.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి