మోడీ ఆరోపణలు దురదృష్టకరం: షరీఫ్, కాశ్మీర్‌తోనేనని..
ఇస్లామాబాద్: భారత్, పాక్‌ల సంబంధాలకు కాశ్మీర్ అంశమే ప్రధాన అవరోధంగా నిలుస్తోందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దీనికి శాంతియుత పరిష్కారాన్ని అన్వేషిస్తే భారత్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కొత్త దారులు వెతకవచ్చని చెప్పారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌పై చేసిన ఆరోపణలు దురదృష్టకరమని, నిరాధారమైనవని షరీఫ్ కొట్టిపారేశారు. భారత్‌పై తీవ్రవాద దాడులను పాక్ ప్రోత్సహిస్తోందని, సరిహద్దుల్లో తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్ శాంతిని కాంక్షించే దేశమని, పొరుగుదేశాలతో శాంతియుత సంబంధాలనే కోరుకుంటుందని తెలిపారు. తాము భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. కాగా, తీవ్రవాదుల దాడుల్లో ధ్వంసమైపోయిన పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా నివాసాన్ని అక్కడి ప్రభుత్వం పునర్నిర్మించింది.
బెలూచిస్థాన్‌లోని ఆయన నివాసాన్ని బాగుచేసి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆవిష్కరించింది. దానిని జాతీయ కట్టడంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నివాసంలోనే జిన్నా తన చివరి రోజులు గడిపారు.












Click it and Unblock the Notifications