వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ మైత్రి: బ్లాంక్ చెక్ లాంటిదన్న నేపాల్ రాయబారి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరుస భూప్రకంపనలతో నేపాల్ రాజధాని ఖాఠ్మండు అతలాకుతలమైంది. పొరుగుదేశమైన నేపాల్‌కు భారత్ అందిస్తోన్న సాయంతో నేపాల్ మెల్ల మెల్లగా ప్రాణం పోసుకుంటోంది. 'ఆపరేషన్ మైత్రి'తో నేపాల్‌ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నేపాల్ పట్ల భారత్ కనబర్చిన స్పందన, సహాయం అపురూపమని నేపాల్ రాయబారి దీప్‌కుమార్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. "నేపాల్‌ను భూకంపం కుదిపివేసిన తక్షణం భారత్ తన ఆపన్న హస్తం అందించింది. వీలైనంత సహాయం చేస్తామని తెలిపింది. ఇది మాకు బ్లాంక్ చెక్ లాంటింది" అని దీప్‌కుమార్ ఉపాధ్యాయ చెప్పారు.

తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండిలేక మూడు రోజులుగా శిథిలాల కింద కుళ్లుతున్న మృతదేహాలతో నగర వీధుల్లో వ్యాపిస్తున్న దుర్గంధాన్ని భరించలేక చాలా మంది ప్రజలు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి నేపాల్ వెళ్లాలనుకుంటున్న తమ దేశస్ధుల కోసం సరిహద్దు దాకా ప్రత్యేక రైళ్లను నడపాలన్న తమ అభ్యర్ధనను కూడా భారత్ మన్నించిందన్నారు.

పొరుగు రాష్ట్రమైన నేపాల్‌కు ఆపన్న హస్తం అందించిన భారత్ చొరవను అమెరికా కూడా కొనియాడింది. భారత్ ఇటీవల వివిధ సందర్భాల్లో అధ్బుత నాయకత్వ పటిమను ప్రదర్శించిందని అమెరికా పేర్కొంది. యెమెన్‌పై సౌదీ అరేబియా దాడి సమయంలో వివిధ దేశాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ, ఇప్పుడు నేపాల్‌లో తక్షణ సహాయక చర్యలను చేపట్టంలో భారత్ ముందుందని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పేర్కొన్నారు.

 'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండిలేక మూడు రోజులుగా శిథిలాల కింద కుళ్లుతున్న మృతదేహాలతో నగర వీధుల్లో వ్యాపిస్తున్న దుర్గంధాన్ని భరించలేక చాలా మంది ప్రజలు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు.

 'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

ప్రధానమంత్రి సుశీల్ కోయిరాలా మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. భూకంప బాధితుల సహాయార్ధం చేపడుతున్న చర్యలను వివరించారు. ఈ చర్యలు ప్రస్తుత భూకంప సంక్షోభానికి తగిన స్ధాయిలో లేవన్నారు.

 'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

నేపాల్‌లో నెలకొన్న ఈ భూకంప సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలన్నీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందని, మృతుల సంఖ్య పదివేలకు చేరుకోవచ్చని అన్నారు.

 'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

భూకంపం వల్ల నేలమట్టమైన భవనాలు, శిధిలాల నుంచి ఇప్పటి వరకూ 5,057 మృతదేహాలను వెలికితీశామని వెల్లడించారు. సహాయం కోసం దేశవ్యాప్తంగా అనేక మారుమూల గ్రామాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం అన్ని ప్రాంతాలకు వెళ్లలేకపోతుందన్నారు.

'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి

'ఆపరేషన్ మైత్రి'ని మరువలేమన్న నేపాల్ రాయబారి


ఈ భూకంప వల్ల దేశంలో సుమారు 80 లక్షల మంది గురయ్యారని తెలిపింది. 'ఆపరేషన్ మైత్రి' పేరుతో భారత్ చేపట్టిన సహాయ కార్యక్రమాలను కూడా వివరించారు.

English summary
"India has been prompt in relief and rescue operations in natural calamity-hit Nepal since day one and has been playing the role of a big brother." This is how Ambassador-designate of Nepal to India Deep Kumar Upadhyay thanked Prime Minister Narendra Modi and Home Minister Rajnath Singh launching “such a large scale round the clock relief work”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X