Heavy Floods: భారత్ ఇరుగుపొరుగులపై ప్రకృతి ప్రకోపం.. మొన్న పాకిస్థాన్, నిన్న బంగ్లాదేశ్..
Nepal News: భారత్ సహా ఇరుగు పొరుగు దేశాలపై ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తూ వస్తోంది. ఇటీవల పాకిస్థాన్ తర్వాత భారత్, బంగ్లాదేశ్ భారీ వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాగా ఇప్పుడు నేపాల్ వంతు వచ్చింది. భారీ వర్షాల కారణంగా వరదలతో పాటు కొండ చరియలు విరిగి పడటంతో సహాయక చర్యలకు కూడా అడ్డంకులు ఎదురవుతున్నయి.
మూడు రోజుల క్రితం ప్రారంభమైన ఈ విపత్తు నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య ఈరోజుకి 215 మార్క్ దాటింది. మరో 28 మంది గల్లంతయ్యారని, 143 మంది గాయపడ్డారనిహోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ తివారీ ప్రకటించారు.

తూర్పు మరియు మధ్య నేపాల్‌లో వివిధ ప్రాంతాలు పెద్ద ఎత్తున ముంపునకు గురయ్యాయి. అయితే దేశ రాజధాని ఖాట్మండులో ఆదివారం నుంచి వాతావరణం కొంత మెరుగుపడటంతో విపత్తు ప్రభావిత ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది. అయితే ఈ విపత్తు వల్ల కేవంల ఖాట్మండు లోయలోనే మరణాల సంఖ్య 50 దాటింది. నేపాల్ ఆర్మీ, పోలీసులతో సహా 20 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది సెర్చ్, రెస్క్యూ మరియు సహాయ పంపిణీకి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
గాయపడిన వారికి వివిధ ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నట్లు తివారీ తెలిపారు. అదేవిధంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన వారికి తక్షణమే సహాయక సామగ్రిని అందజేస్తున్నారు. మూసుకుపోయిన రహదారులను పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తివారీ తెలిపారు. వాతావరణ మార్పులతో పాటు వరదల ప్రభావం పెరగడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications