నేపాల్ ప్రధానికి వరుస షాక్ లు- భారత్ కు ఎదురెళ్లేందుకేు ఆర్మీ, విపక్షాల నిరాకరణ...

భారత్ లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియాథురా ప్రాంతాలను తమ దేశ భూభాగంలోనే ఉన్నట్లు చూపుతూ రూపొందించిన కొత్త మ్యాప్ ఆమోదం విషయంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా చైనా చెప్పినట్లు ఆడుతున్న కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం రూపొందించిన ఈ మ్యాప్ ను ఆమోదించేందుకు నేపాల్ పార్లమెంటులో విపక్షాలు ససేమిరా అన్నాయి.

Recommended Video

    Nepal Fails Over Newly Formed Map || భారత్ తో పెట్టుకుంటే తట్టుకోలేము అంటున్న నేపాల్

    ప్రభుత్త్వం ఇప్పటికే ఆమోదించిన మ్యాప్ కు పార్లమెంటు ఆమోదం కూడా కావాల్సి రావడంతో ప్రధాని ఈ ప్రతిపాదన చేశారు. అయితే విపక్షాలు మాత్రం కొత్త మ్యాప్పై కలిసి రాలేమని తేల్చి చెప్పేశాయి. దీంతో మ్యాప్ ఆమోదం ప్రక్రియ వాయిదా పడింది.

    nepal pm fails to get consensus among parties in parliament over new map

    బుధవారం పార్లమెంటులో ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉండగా... అంతకు మందే ప్రభుత్వం రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కూడగట్టలేకపోయింది. దీంతో అజెండా నుంచి చివరి నిమిషంలో ఈ బిల్లును తొలగించాల్సి వచ్చింది. మరోవైపు కొత్ మ్యాప్ రూపకల్పనలో చైనా ప్రమేయముందని భారత ఆర్మీ ఛీఫ్ నరవణే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని ప్రధాని ఓలీ ఆదేశించినా నేపాల్ ఆర్మీ ఛీఫ్ పూర్ణచంద్ర థాపా మాత్రం దాన్ని పట్టించుకోలేదు.

    అక్కడితో ఆగకుండా మ్యాప్ వ్యుహహారం పూర్తిగా రాజకీయ పరమైనదేనంటూ స్పష్టం చేశారు. దీంతో భారత్ కు వ్యతిరేకంగా నేపాల్ ప్రధాని వేస్తున్న ఎత్తుగడలకు ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలినట్లయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+