వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: అమెరికా సరసన బ్రిటన్, కొత్త వీసా నిబంధనలు అమలు

అమెరికాతో పాటు బ్రిటన్ నుండి కూడ వీసా నిబంధనలను కఠినతరం చేసింది.కొత్త నిబంధనలు ఏప్రిల్ 6వ, తేది నుండి అమల్లోకి రానున్నాయి.భారత్ తో పాటు ఇతర దేశాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: అమెరికాతో పాటు బ్రిటన్ నుండి కూడ వీసా నిబంధనలను కఠినతరం చేసింది.కొత్త నిబంధనలు ఏప్రిల్ 6వ, తేది నుండి అమల్లోకి రానున్నాయి.భారత్ తో పాటు ఇతర దేశాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకొంటున్న పరిణామాలు టెక్కీలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ప్రధానంగా అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత టెక్కీలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు ఇబ్బందులను భారత టెక్కీలకు చుక్కలు చూపుతున్నాయి.స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ ఈ నిర్ణయాలను తీసుకొన్నాడు.

అమెరికాతో పాటు బ్రిటన్ కూడ తాజాగా వీసా నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రభావం ఇండియాపై తీవ్రంగా చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్రిటన్ లో కొత్త వీసా నిబంధనలు అమల్లోకి

బ్రిటన్ లో కొత్త వీసా నిబంధనలు అమల్లోకి

వీసా ఛార్జీల పెంపు, ఇతర కఠిన నిర్ణయాలతో బ్రిటన్ గతేడాది మార్చిలో ప్రకటించిన వీసా నిబంధనలు ఏప్రిల్ 6వ, తేది నుండి అమల్లోకి వస్తున్నాయి.ఈ నిబంధనలు అమల్లోకి రావడం వల్ల ఇండియాతో పాటు నాన్ యూరోపియన్ దేశాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.టైర్ 2 కేటగిరిల్లో భారీ మార్పులు రానున్నాయి.

ఇతర దేశాల ఉద్యోగులకు వెయ్యి పౌండ్లు

ఇతర దేశాల ఉద్యోగులకు వెయ్యి పౌండ్లు

ఈయూకు సంబంధం లేని ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను నియమించుకొనే బ్రిటన్ కంపెనీలు ఇమ్మిగ్రేషన్ స్కిల్స్ ఛార్జీ కింద ఇకపై అదనంగా ఒక్కో ఉద్యోగికి ఏడాదికి వెయ్యి పౌండ్లు చెల్లించాల్సిందే.చిన్న చారిటబుల్ సంస్థలు 364 పౌండ్లు చెల్లించాలి.

టైర్ 2 కింద ఏడాదికి 200 పౌండ్లు చెల్లించాలి

టైర్ 2 కింద ఏడాదికి 200 పౌండ్లు చెల్లించాలి


టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ) వీసా కోసం ధరఖాస్తు చేసేవారు ఏడాదికి 200 పౌండ్ల హెల్త్ సర్ ఛార్జీని చెల్లించాలి. వలసదారులకు ఉద్యోగాలిచ్చే సంస్థలను తగ్గించి, ఆ ఉద్యోగాలను బ్రిటిషర్లతో భర్తీ చేసేందుకు వారికి శిక్షణ ఇవ్వడానికి ఈ నిర్ణయాలు తీసుకొన్నట్టు యూకే హోం ఆఫీసు తెలిపింది.

విద్యార్థుల వీసాలకు చార్జీల మినహాయింపు

విద్యార్థుల వీసాలకు చార్జీల మినహాయింపు


పీహెచ్ డీ స్థాయి ఉద్యోగాలకు, విద్యార్థి వీసా నుండి వర్కింగ్ వీసాకు మారే విదేశీ విద్యార్థులకు చార్జీల నుండి మినహాయింపు ఉంటుందని బ్రిటన్ ఆర్థిక పురోగతికి కీలకమైన నిపుణులను దేశంలో ఉంచుకోవడానికి ఇది రక్షణ కల్పిస్తోందని పేర్కొంది.ఈయూ యేతర దేశాల నుండి వచ్చే వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు బ్రిటన్ టైర్ 2 నిబంధనను కఠినతరం చేసింది.

నేరచరిత్ర లేదని సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే

నేరచరిత్ర లేదని సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే


బ్రిటన్ లో ఉద్యోగంతో పాటు నివాసానికి గారు టైర్ 2 వీసాలకు ధరఖాస్తు చేసే టీచర్లు, నర్సులు తదితర వృత్తులవారు తమకు నేరచరిత లేదని స్వదేశాల నుండి సర్టిఫికెట్లు సమర్పించాలని హొంశాఖ పేర్కొంది.ధరఖాస్తుదారుడి జీవిత భాగస్వామి, నైపుణ్యవలసదారు ఉద్యోగం కోరే జీవిత భాగస్వామి కూడ ఈ ధృవీకరణ పత్రాలను ఇవ్వాల్సిందే.

కనీస వేతనం ఏడాదికి 30 వేల పౌండ్లు

కనీస వేతనం ఏడాదికి 30 వేల పౌండ్లు

ఏడాదికి కనీసవేతనాన్ని 25 నుండి 30 వేల పౌండ్లకు పెంచారు.టైర్ 2 ఐసీటీ షార్ట్ టర్మ్ స్టాఫ్ వీసాలను రద్దు చేశారు. కొరత ఉన్న ఉద్యోగాల జాబితా నుండి కెమిస్ట్రీ టీచర్లను తొలగించారు. సైన్స్, కంప్యూటర్ సైన్స్, మాండరిన్ ఉమ్మడిగా బోధించే టీచర్లను చేర్చారు.

English summary
A series of new visa restrictions that will affect Indian and other non-EU countries come into effect from April 6, including an ‘immigration skills charge’ of £1000 per year, higher salary thresholds and a health surcharge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X