New Zealand PM Resignation : న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ రాజీనామా..

న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో దేశంలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఇవాళ జరిగిన పార్టీ వార్షిక కాకస్ సమావేశంలో ఆర్డెర్న్ ఈ సంచలన ప్రకటన చేశారు. న్యూజీలాండ్ లో తాజాగా వెలువడిన పోలింగ్ సర్వేల్లో జసిండా నేతృత్వంలోని లేబర్ పార్టీ.. ప్రతిపక్ష నేషనల్ కంటే కాస్త వెనుకబడి ఉంది. అయితే తన ముందస్తు రాజీనామాకు అది కారణం కాదని జసిండా వెల్లడించారు. అలాగే తన కుటుంబంతో సంతోషంగా గడపడం మినహా భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏవీ లేవన్నారు.

దేశంలో చేపట్టాల్సిన సంస్కరణలకు ఇప్పుడు తగినంత సమయం లేదని, అందుకే ముందుగానే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు జసిండా ప్రకటించారు. ప్రధానిగా ఆమె పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 7వరకూ ఉంది. అయితే ముందుగానే రాజీనామా చేశారు. కానీ ఈ ఏడాది ఎన్నికలు ముగిసేవరకూ ఆమె ఎంపీగా కొనసాగబోతున్నారు.
రాజకీయ నాయకులంతా మనుషులేనని, తమ పరిధిలో చేయగలినంత కాలం పనిచేస్తామని జసిండా పేర్కొన్నారు.

New Zealand prime minister Jacinda Ardern resigns before ending tenure, polls in october

2017లో జసిండా ఆర్డెర్న్ 37 సంవత్సరాల వయస్సులో ప్రధాన మంత్రిగా ఎన్నికై.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా ప్రభుత్వాధినేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా సమయంలోనూ, క్రైస్ట్‌చర్చ్, వైట్ ఐలాండ్‌లోని రెండు మసీదులపై జరిగిన ఉగ్రదాడితో సహా పెద్ద విపత్తుల సమయంలోనూ న్యూజిలాండ్‌ ప్రధానిగా ఆమె సమర్ధంగా పనిచేశారు. తన ఐదేళ్ల పదవీకాలం సంతృప్తికరంగా ముగిసినట్లు జసిండా పేర్కొన్నారు. న్యూజిలాండ్ వాసులు తన నాయకత్వాన్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆర్డెర్న్.. ఎల్లప్పుడూ దయతో ఉండటానికి ప్రయత్నించే వ్యక్తిగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+