వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలోని ఓ మారుమాల కుగ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ భారీ విగ్రహాన్ని అక్కడి ప్రభుత్వం కూల్చి వేసింది. ఎలాంటి అనుమతి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్టించారంటూ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించింది.

మావో జెడాంగ్‌ 37 మీటర్ల భారీ విగ్రహాన్ని హేనన్‌ ప్రాంతంలోని కైఫెంగ్‌ వద్ద ఇటీవలే ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. మావో జెడాంగ్ హుందాగా కూర్చుని ఉన్న ఈ భారీ విగ్రహాన్ని ఉక్కు, కాంక్రీటుతో రూపొందించి బంగారు రంగు వేశారు.
ఈ విగ్రహం నిర్మించడానికి సుమారు రూ. 3 కోట్లకు పైగానే ఖర్చు పెట్టింది.

నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత

నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత


ఓ మారుమాలు కుగ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించడంతో బంగారు విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించేందుకు ప్రజలు సైతం ఆసక్తిని కనబరిచారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన మావో జెడాంగ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక రైతులు, వ్యాపారులు, మావో అభిమానులు ఇందుకోసం విరాళాలు సమర్పించారు.

 నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత

నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత


పేద కళాకారులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత నెలలోనే విగ్రహ ప్రతిష్ట పూర్తైంది. విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆకర్షణీయంగా ఉండడంతో సోషల్ మీడియాలో దీనిపై జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు అనుమతి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్టించారంటూ విగ్రహాన్ని కూల్చివేశారు.

నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత

నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత


ఈ విషయాన్ని పీపుల్స్‌ నెట్‌ న్యూస్‌ పోర్టల్‌ రిపోర్ట్‌ చేసింది. విగ్రహం కూల్చివేతపై మావో అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కాగా, 1893, డిసెంబర్ 26న జన్మించిన మావో తన 82వ ఏట సెప్టెంబర్ 9, 1976లో మరణించారు.

 నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత

నో పర్మిషన్: మావో విగ్రహం కూల్చివేత

40ఏళ్ల తర్వాత మావో జెడాంగ్‌కు భారీ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఇటీవలే మావో జెడాంగ్ రాసిన ఓ లేఖ వేలంలో రికార్డు ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే.

English summary
The absence of government approval has apparently caused the demolition of a giant gold painted statue of Communist China’s founding father Mao Zedong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X