నేడు, రేపు ఈ తెలంగాణా జిల్లాల్లో వరుణుడు, ఈ జిల్లాలలో భానుడు ప్రభావం!

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు ఊపందుకోవడంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ద్రోణి కారణంగా రాబోయే రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పలు జిల్లాల్లో ఇవాళ, శనివారం వర్షాలు కురిసే అవకాశం

ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, శనివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

IMD Alert Telangana Weather Forecast Moderate to Heavy Rains Expected heat waves in these districts

నేడు, రేపు ఈ జిల్లాలలో వర్షాలు

నేడు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. శనివారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

రాబోయే 24 గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం

హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాలలో రాబోయే 24 గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా జల్లులు పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు బలంగా వీయడం వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి, ప్రజలకు తీవ్రమైన ఎండల నుండి ఉపశమనం లభించింది.

వర్షాలు పడేచోట అలెర్ట్

నైరుతి రుతుపవనాలు క్రమంగా రాష్ట్రమంతటా విస్తరిస్తుండటంతో వ్యవసాయ పనులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఉరుములు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, సహకార సంఘాలకు తీపికబురు చెప్పిన సీఎం రేవంత్!
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, సహకార సంఘాలకు తీపికబురు చెప్పిన సీఎం రేవంత్!

ఈ జిల్లాలలో వేడి గాలులు, ఎండ తీవ్రత

మరోవైపు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో వేడి వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇవాళ, శని, ఆదివారాల్లో నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ వేడిగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+