దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న టాప్-10 సినిమాలు
సినిమా థియేటర్లలో హిట్టా, ఫట్టా అన్నదానితో ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌కు అస్సలు సంబంధం లేదు. వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఎన్నో చిత్రాలు ఓటీటీల లోకి రాగానే మిరాకిల్స్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసిన 'ఇండియా వైడ్' టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్‌ను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రైమ్‌లో మన తెలుగు, తమిళ చిత్రాల హవా గట్టిగా నడుస్తోంది. ఆ టాప్ 10 సినిమాల ముచ్చట్లేంటో ఓసారి చూద్దాం.
టాప్ 2 లో నెంబర్ 1 డెకాయిట్
అడవి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ అంచనాలతో వచ్చి బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. కానీ, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఇప్పుడు ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది.

నెంబర్ 2 అగ్లీ స్టోరీ
నందు, అవికా గోర్ జంటగా నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ 'అగ్లీ స్టోరీ'. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే డిజాస్టర్ టాక్‌తో ఓటీటీ బాట పట్టింది. విచిత్రంగా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌పై ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రైమ్‌లో ఇది రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
మూడో స్థానంలో హిందీ క్రైమ్ డ్రామా సిస్టెమ్
జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ 'సిస్టెమ్' ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపని ఈ లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ డ్రామాను ఓటీటీ ఆడియెన్స్ బాగానే ఆదరిస్తున్నారు.
నాలుగో స్థానంలో గోదారి గట్టుపైన
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా, జగపతిబాబు కీలక పాత్రలో తెరకెక్కిన పల్లెటూరి ప్రేమకథా చిత్రం 'గోదారి గట్టుపైన'. థియేటర్లలో యావరేజ్‌గా నిలిచిన ఈ సినిమా, గతవారమే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రైమ్‌లో నాలుగో స్థానంలో దూసుకుపోతోంది.
5వ స్థానం - కార్మేని సెల్వం , తమిళం: సముద్రఖని, గౌతమ్ మీనన్ నటించిన ఈ బ్యాంక్ లోన్ల నేపథ్య చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రైమ్‌లో ఐదో స్థానంలో నిలిచింది.
6వ స్థానం - సట్టెండ్రు మారుదు వానిలై, తమిళం: తమిళానికి చెందిన ఈ చిత్రం కూడా ప్రైమ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
7వ స్థానం - లీడర్, తమిళం: లెజెండ్ శరవణన్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ థియేటర్ల తరహాలోనే ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.
8వ స్థానం - జాక్ ర్యాన్ ఘోస్ట్ వార్: హాలీవుడ్ పాపులర్ యాక్షన్ సిరీస్ 'జాక్ ర్యాన్' నుంచి వచ్చిన 'ఘోస్ట్ వార్' ప్రైమ్‌లో ఎనిమిదో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
9వ స్థానం - ప్రైమేట్ : హాలీవుడ్‌కు చెందిన ఈ విభిన్నమైన చిత్రం ప్రైమ్ ఇండియా లిస్ట్‌లో తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది.
10వ స్థానం - కాలిదాస్ 2 తమిళం: సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ కోలీవుడ్ మూవీ ప్రైమ్ టాప్ 10 స్థానాన్ని దక్కించుకొని ట్రెండింగ్ లిస్ట్‌ను ముగించింది.
థియేటర్లలో నిరాశపరిచిన కంటెంట్‌ను కూడా ఓటీటీ ప్రేక్షకులు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ స్క్రీన్స్‌పై చూస్తూ సక్సెస్ చేస్తుండటం విశేషం. ముఖ్యంగా తెలుగు సినిమాల జోరు దేశవ్యాప్తంగా ప్రైమ్‌లో గట్టిగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications