'తల్లికి వందనం' నిధుల జమ పై తాజా ఆదేశాలు, ఇలా చేయకుంటే వీరికి కట్..!!

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధుల జమ పైన కసరత్తు మొదలు పెట్టింది. ఈ రోజు వేసవి సెలవులు పూర్తి చేసుకొని పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వం ఖరారు చేసింది. తల్లికి వందనం నిధులు ఈ వారంలోనే జమ చేసేలా తొలుత నిర్ణయించారు. అయితే, ఇప్పుడు అధికారులు కీలక మార్గదర్శకాలు జారీ చేసారు. లబ్ది దారులకు కీలక సూచనలు అందించారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధుల జమ పైన తాజాగా కసరత్తు మొదలైంది. తొలుత ఈ నెల 19 లేదా 20న నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి వారంలోనే నిధులు జమ చేయటంతో పాటుగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ పైన ఆలోచన చేసారు. అదే విధంగా పాఠశాలల ప్రారంభం సమయంలోనే విద్యార్ధులకు అందించే కిట్స్ ఇవ్వాలని భావించారు. అయితే, ఇప్పుడు ఇవన్నీ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. జూలై తొలి వారంలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని చెబుతున్నారు. అదే విధంగా విద్యార్ధులకు అందించే విద్యా కిట్స్ సైతం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో వీటిని విద్యార్ధులకు పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

మోదీ కేబినెట్ లోకి జనసేన, పవన్ ఛాయిస్ ఆయనే..!?
మోదీ కేబినెట్ లోకి జనసేన, పవన్ ఛాయిస్ ఆయనే..!?
ap-govt-latest-exercise-to-credit-thalli-ki-vandanam-funds-in-eligible-beneficiaries-here-the-detai

జూలై తొలి వారంలో నిధుల విడుదలకు ఛాన్స్

తల్లికి వందనం పథకం అమలు పైన అధికారులకు తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. లబ్దిదారుల జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. తల్లికి వందనం నిధులు అందుకోవాలంటే తప్పనిసరిగా తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇక ఎన్‌పీసీఐ పూర్తయి ఉండాలని.. ఇక మూడో విషయం బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ పూర్తి చేసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. చాలామంది విద్యార్థుల వివరాలు ఎన్‌పీసీఐ లాగిన్‌లో తెరుచుకోవడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రలు బ్యాంక్ ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్‌పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్‌పీసీఐ లింకింగ్ చేయాలని తాజా ఆదేశాల్లో స్పష్టత ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+