వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: నైజీరియాలో మనిషి మాంసం వడ్డించిన రెస్టారెంట్‌‌ మూసివేత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మనిషి మాంసంతో వంటకాలు తయారుచేస్తున్న నైజీరియాలోని ఓ రెస్టారెంట్‌ను ఆదివారం నాడు పోలీసులు మూసివేశారు. దీనికి సంబంధించిన ఓ వార్తాకథనాన్ని బీబీసీ స్వాహిలీ ప్రచురించింది. అందులో పేర్కొన్న కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

మనిషి మాంసంతో వంటకాలు చేసి వడ్డిస్తున్నారంటూ సమాచారం అందడంతో నైజీరియాలోని అనంబ్ర ప్రాంత పోలీసులు ఒక హోటల్‌పై దాడి చేశారు. దాడి సమయంలో హోటల్‌లోని రెస్టారెంట్‌లో కనిపించిన వాస్తవిక దృశ్యాలు చూసిన వారు ఆశ్చర్యపోయారు.

 HUMAN flesh

గదిలో ప్లాస్టిక్‌ బ్యాగుల్లో పెట్టిన రెండు మనిషి తలలున్నాయి. అవి తాజావి అనడానికి గుర్తుగా వాటినుంచి రక్తం ఇంకా కారుతోందని పోలీసులు వెల్లడించారు. తాము వెళ్లేటప్పటికి ఆ హోటల్‌ సిబ్బంది మనిషి మాంసం కోస్తుండటాన్ని గమనించి వారు నిర్ఘాంతపోయామన్నారు.

వెంటనే పోలీసులు అక్కడున్న పది మందిని అరెస్టుచేసి ఆగమేఘాల మీద ఆ హోటల్‌ను మూసివేశారు. రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఒక మతగురువు ఒకసారి తనకు 700 నైరాల బిల్లు (సుమారు రూ.220) వేశారని, అంత బిల్లు ఎందుకైందని అడిగితే తన భోజనంలో వడ్డించిన మాంసం ముక్క ఖరీదైనదని చెప్పారని వివరించారు.

అంతేకాదు తనకి వడ్డించిన మాంసం మనిషి మాంసం అని తెలియగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ‘అయితే అది మనిషి మాంసం అని నాకు నిజంగా తెలియదు' అని ఆయన వెల్లడించారు. స్థానికులు సైతం ఆ హోటల్‌ పరిసరాలు భయం గొలిపేలా ఉంటాయని పేర్కొన్నారు.

రెస్టారెంట్ యజమాని, అందులో పనిచేసేవారు ఎప్పుడూ అనుమానాస్పదంగా కనిపిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంటర్నెట్లో తనకు పరిచయమైన వాలంటీర్‌ని చంపి తిన్నందుకు గాను జర్మనీకి చెందిన ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించారు.

English summary
Reports emerged yesterday that visitors to the hotel restaurant in Anambra, Nigeria, alerted police to rumours that the restaurant had been plating up human meat, according to BBC Swahili.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X