కన్యత్వాన్ని ఇస్తా: మిలిటెంట్లకు పాప్ సింగర్ ఆఫర్
అబుజా: పాఠశాల అమ్మాయిలను అపహరించిన బోకో హరామ్ మిలిటెంట్లకు నైజీరియా మహిళా పాప్ సింగర్ సంచలనాత్మకమైన ఆఫర్ ఇచ్చారు. అమ్మాయిలను వదిలేస్తే మిలిటెంట్లకు తన కన్యత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ 23 ఏళ్ల పాప్ సింగర్ అడోకియే ప్రకటించింది.
చిబోక్ స్కూల్ అమ్మాయిలను 200 మందిని మిలిటెంట్లు అపహరించడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేసింది. వారు చాలా చిన్న పిల్లలని ఆమె ఓ స్థానిక న్యూస్ సైట్‌తో అన్నది. అది సరైంది కాదని, వారికి బదులుగా తనను తాను అర్పించుకుంటానని చెప్పింది.

అపహరణకు గురైన పిల్లలు 12. 15 ఏళ్ల మధ్య వయస్సు గలవారని, తాను వారికన్నా పెద్దదాన్నీ అనుభవం గలదాన్ననీ ఆమె చెప్పుకుంది. ప్రతి రాత్రి 10, 12 మంది తనను వాడుకోవచ్చునని ఆమె అన్నది. పిల్లలను వదిలేసి, వారి తల్లిదండ్రుల వద్దకు చేరేలా చూడాలని కోరింది.
ఇమో స్టేట్ అంబాసిడర్‌గా ఆ పాప్ సింగర్ వ్యవహరిస్తోంది. గతంలో కూడా ఇటువంటి ప్రకటనే చేసి ఆమె వార్తల్లోకి ఎక్కింది. తన తల్లికి ప్రైవేట్ జెట్ ఇచ్చే వ్యక్తికి తనను అర్పించుకుంటానని ప్రకటన చేసింది.












Click it and Unblock the Notifications