Nobel Prize 2022: మెడిసిన్‌లో అత్యద్భుతం - 70 వేల ఏళ్లటి ఆదిమ మానవుల జన్యువు ఆవిష్కరణ
స్టాక్‌హోమ్: వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది.
Learn more about the 2022 #NobelPrize in Physiology or Medicine
— The Nobel Prize (@NobelPrize) October 3, 2022
Press release: https://t.co/i5vP8KnAHQ
Advanced information: https://t.co/MoNFfSZP3G pic.twitter.com/mytWJBIDzB
మెడిసిన్‌లో అద్భుతాలను ఆవిష్కరించిన స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబొను ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. మెడిసిన్‌కు సంబంధించిన నోబెల్ ప్రైజ్ కోసం పాబొ పేరును ఎంపిక చేసినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ కార్యదర్శి థామస్ పెర్ల్‌మాన్ ఆయన పేరును ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

BREAKING NEWS:
— The Nobel Prize (@NobelPrize) October 3, 2022
The 2022 #NobelPrize in Physiology or Medicine has been awarded to Svante Pääbo “for his discoveries concerning the genomes of extinct hominins and human evolution.” pic.twitter.com/fGFYYnCO6J
అంతరించిపోయిన హోమినిన్‌ల జన్యువులు, మానవ పరిణామానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను నోబెల్ బహుమతిని ప్రకటించినట్లు థామస్ పెర్లమాన్ చెప్పారు. హోమినిన్ జన్యువులు దాదాపు అంతరించిపోయినట్లు భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి సంబంధించిన మానవ పరిణామాలను స్వాంటె పాబో ఆవిష్కరించారని పేర్కొన్నారు. నియాండర్తల్ ఎముకల నుంచి అతి పురాతన డీఎన్ఏను సంగ్రహించడంతో పాటు దాన్ని సీక్వెన్స్‌ను విశ్లేషించడానికి పాబో ఆవిష్కరణలు ఉపయోగపడనున్నాయి.
Say good morning to our new medicine laureate Svante Pääbo!
— The Nobel Prize (@NobelPrize) October 3, 2022
Pääbo received the news while enjoying a cup of coffee. After the shock wore off, one of the first things he wondered was if he could share the news with his wife, Linda.
Photo: Linda Vigilant pic.twitter.com/l27hnzojaL
70,000 సంవత్సరాల కిందట ఆదిమ మానవులు ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తరువాత ఈ హోమినిన్‌ల నుంచి హోమో సేపియన్‌లకు జన్యు బదిలీ అయినట్లు పాబొ తన పరిశోధనల్లో గుర్తించారు. హోమినిన్‌ల నుంచి హోమోసేపియన్‌లకు బదిలీ అయ్యే క్రమంలో ఈ జన్యువులు, మానవ పరిణామ క్రమాన్ని ఆయన ఆవిష్కరించగలిగారు.
2022 #NobelPrize laureate Svante Pääbo found that gene transfer had occurred from these now extinct hominins to Homo sapiens. This ancient flow of genes to present-day humans has physiological relevance today, for example affecting how our immune system reacts to infections. pic.twitter.com/QYHalqE8sb
— The Nobel Prize (@NobelPrize) October 3, 2022
ఆదిమ మానవుల డీఎన్ఏపై పరిశోధనలు చేశారు. నియాండర్తల్ మైటోకాండ్రియా నుంచి డీఎన్‌ఏను విశ్లేషించారు. పాలియోజెనెటిక్స్ వ్యవస్థాపకులలో ఆయనా ఒకరు. నియాండర్తల్ జన్యువుపై విస్తృతంగ పరిశోధనలు చేశారు. 1950 ఏప్రిల్ 20వ తేదీన స్వీడన్‌లో జన్మించారు పాబో. 1990లో మ్యూనిచ్ యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా అపాయింట్ అయ్యారు. 1997లో జర్మనీలో మాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీలో ఆంత్రోపాలజీ అండ్ జెనెటిక్స్ విభాగానికి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జపాన్‌లోని ఒకినావా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్‌గా సేవలను అందించారు.












Click it and Unblock the Notifications