షాకింగ్: గురితప్పిన ఉత్తరకొరియా క్షిపణి, తప్పిన పెను ప్రమాదం, సొంత నగరంపైకే దూసుకొచ్చి..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారనేది సామెత. ఈ సామెత ప్రస్తుతం ఉత్తరకొరియాకు బాగా నప్పుతుంది. ఎందుకంటే తన అణ్వాయుధ సామర్థ్యం, శక్తి యుక్తులు ప్రపంచానికి చాటాలనే తపనతో అది చేపడుతున్న క్షిపణి ప్రయోగాలు ఏదో ఒకరోజు గతితప్పి ఆ దేశానికే పెనుముప్పుగా మారడం తథ్యం.

దీనికి మంచి ఉదాహరణ.. 2017 ఏప్రిల్‌లో ఉత్తర కొరియా ప్రయోగించిన హ్వాసాంగ్-12 అనే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగమే. ఆ రోజున ఉత్తరకొరియా ప్రయోగించిన ఈ మిస్సైల్ గురితప్పి ఆ దేశంలోనే ఓ నగరంపైనుంచి దూసుకెళ్లిందట. ఈ విషయం అమెరికాకు చెందిన ఓ అధికారి ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది.

North Korea accidentally hit one of its own cities with a ballistic missile last year

అగ్రరాజ్యం అమెరికా సహా వివిధ దేశాలు ఎంతగా హెచ్చరిస్తున్నా ఉత్తరకొరియా పెడచెవిన పెడుతూ ఎడా పెడా క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2017 ఏప్రిల్‌లో ఉత్తర కొరియా ప్రయోగించిన హ్వాసాంగ్-12 అనే బాలిస్టిక్ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా ఆ దేశంలోని టోక్చోన్ అనే నగరం మీదుగా దూసుకెళ్లిందట.

టోక్చోన్ నగరంలో సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కి 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎయిర్‌ ఫీల్డ్‌ నుంచి బయలుదేరిన హ్వాసాంగ్-12 క్షిపణి నిజానికి జపాన్ మీదుగా దూసుకెళ్లాల్సింది.

ఈ క్షిపణి టోక్చోన్ నగరం మీదుగా దూసుకెళ్లిన సమయంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ, ఆ నగరంలోని వ్యవసాయ క్షేత్రాలు, భవనాలు కుప్పకూలిపోయినట్లు శాటిలైట్‌ దృశ్యాల్లో కనిపించింది.

ఈ విషయాలను అమెరికాకు చెందిన ఓ అధికారి 'ది డిప్లొమాట్' అనే ఆంగ్ల పత్రికకు బుధవారం వెల్లడించారు. ఉత్తరకొరియా ప్రయోగించిన హ్వాసాంగ్-12 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విఫలం కావడంతో అమెరికా కూడా పెద్దగా దీని గురించి పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In April, Pyongyang launched a Hwasong-12 intermediate-range ballistic missile that failed shortly after launch and ended up hitting the city of Tokchon, roughly two hours from the capital, The Diplomat reported on Wednesday. The missile's failure was widely reported at the time but it was not previously known that the Hwasong-12 crashed in a populated area. From a location near North Korea's Pukchang Airfield, the missile flew approximately 39 kilometers (24 miles) to the northeast where it struck a complex of industrial or agricultural facilities in Tokchon, The Diplomat said, citing satellite imagery. That complex, located near residential and commercial buildings, likely experienced a large explosion but The Diplomat said it was impossible to determine whether there were casualties.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి