జాతి శతృవుల ముందు తలవంచబోం: అమెరికా రాజీ పడటంపై నిప్పులు చెరిగిన ఇజ్రాయెల్

అమెరికా, ఇరాన్‌ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న శుక్రవారం నాడు ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. దీనివల్ల వ్యూహాత్మకంగా ప్రపంచ రవాణా రంగానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధి రవాణా మార్గం వెంటనే తెరుచుకుంటుందని, దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు పలుకుతూ నూతన దౌత్య సంబంధాలు ఊపందుకుంటాయని ట్రంప్ వివరించారు.

దీనిపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై నిప్పులు చెరిగారు. ట్రంప్ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ అమెరికా ఆధీనంలో లేదని, తమది స్వతంత్ర, సార్వభౌమ దేశమని గుర్తు చేశారు. ఇజ్రాయెల్ భద్రతను పణంగా పెట్టి అంతర్జాతీయ ఒత్తిడికి లోబడ్డ ప్రతిసారి, తాము వడ్డీతో కలిసి రక్తాన్ని చిందించాల్సి వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు.

Not a Banana Republic as Ben-Gvir Says Trump s Agreement Doesn t Bind Israel an independent nation

సూపర్ పవర్ అమెరికా పట్ల తమకు ఎనలేని గౌరవం ఉన్నందని, ట్రంప్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతతో ఉంటామని బెన్ గ్విర్ అన్నారు. అయినప్పటికీ, తమది స్వయంప్రతిపత్తి కలిగిన దేశమని, బలహీనమైన 'బనానా రిపబ్లిక్' కాదనే విషయాన్ని అందరూ గ్రహించాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్ భద్రతను ఎటువంటి హామీ ఇవ్వని ఈ శాంతి ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేశారు. తాము హెజ్బొల్లాను కూల్చివేయడం కంటే తక్కువ స్థాయికి రాజీపడబోమని ఆయన అన్నారు.

గతంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్ల ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఎలా దెబ్బతిన్నాయో బెన్ గ్విర్ వివరించారు. కొన్ని అనుభవాలను ఉదాహరించారు. భద్రతా విషయాలలో అంతర్జాతీయ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గిన ప్రతిసారీ దేశ పౌరుల రక్తంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఓస్లో ఒప్పందాలు, 2006 నాటి లెబనాన్ అగ్రిమెంట్, గాజా సరిహద్దుల్లో అనుసరించిన విధానాలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఆయా సందర్భాల్లో తీసుకున్న బలహీనమైన నిర్ణయాలు చివరకు తమదేశ ప్రాణాల మీదకే తెచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు రక్షణ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వ్యూహాలలో తాము ఎటువంటి రాజీపడే ప్రసక్తే లేదని ప్రకటించారు. హెజ్బోల్లాను పూర్తిగా నిర్మూలించడమే తమ పరమావధి అని తేల్చి చెప్పారు. ప్రాణాలను అర్పించి తమ వీర సైనికులు ఉగ్రవాద రహితంగా మార్చిన దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల నుండి ఏ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోమని అన్నారు.

లెబనాన్ నుండి వచ్చే ప్రతి డ్రోన్, యుఏవీ, క్షిపణి దాడికి ప్రతీకారంగా దహియాపై తాము దాడి చేస్తూనే ఉంటామని ప్రకటించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన తమ యూదు జాతి శత్రువుల ముందు ఎన్నటికీ మోకరిల్లబోదని బెన్ గ్విర్ ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ 3,000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన దేశమని, పరిపూర్ణ నమ్మకంతో తిరిగి తమ దేశాన్ని నిర్మించుకున్న ప్రజలు జాతి శత్రువుల ముందు అస్సలు తలవంచబోదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+