సూయజ్ కాలువలో అద్భుతం-క్లేన్లు, బోట్లు కాదు- ఆదుకున్న పున్నమి చంద్రుడు
సూయజ్ కాలువలో పెద్ద అద్భుతమే జరిగింది. వారం రోజుల క్రితం అనూహ్యంగా కాల్వలో ఇరుక్కుపోయిన భారీ కంటెయినర్ నౌక ప్రపంచ దేశాల్ని కలవరపెట్టింది. దేశ విదేశాలకు చెందిన నిపుణులు ఇప్పట్లో ఈ నౌక బయటికి రావడం కష్టమని తేల్చేశారు. ఇక కొన్ని దేశాలైతే సూయజ్ కాలువ నుంచి ఇక రవాణా జరిగినట్లేననే నిర్ణయానికి వచ్చేశారు. నౌకను వెలికి తీయడం ఇప్పట్లో అసాధ్యమని భావించిన ఈజిప్ట్ అందులో ఉన్న కంటెయినర్లను అన్‌లోడ్ చేసేందుకు సిద్ధమైపోయింది. కానీ మానవ శక్తి, సాంకేతిక పరిజ్ఞానం చేయలేని పనిని ప్రకృతి చేసి పెట్టింది. దీంతో అంత భారీ కంటెయినర్ నౌక ఇప్పుడు యథాతథస్ధితికి వచ్చేసింది.
సూయజ్ కాలువలో చిక్కుకున్న నౌక
యూరప్‌నూ, ఆసియా దేశాలనూ కలిపే సూయజ్ కాలువలో వారం రోజుల క్రితం ఓ భారీ నౌక చిక్కుకుపోయింది. ఇది ఆ మార్గంలో వెళ్లే మిగతా నౌకల ప్రయాణాలకు అడ్డంకిగా మారింది. సూయస్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఈ భారీ కంటెయినర్ నౌకను బయటికి తీయకపోతే ప్రపంచమే స్తంభించిపోతుందన్నంత ఆందోళన వ్యక్తమైంది. దీనికి ప్రధాన కారణం ఈ మార్గం గుండా జరుగుతున్న భారీ రవాణా కార్యకలాపాలే. దీంతో ప్రపంచదేశాలన్నీ తలోచేయి వేసేందుకు సిద్ధమయ్యాయి. అయినా ఎక్కడో ఓ అనుమానం. ఎన్ని ప్రయత్నాలు చేసినా నౌక బయటికి రాకపోవచ్చని ఓ దశలో అంతా అంచనాకు వచ్చేశారు. నౌక బయటికి వచ్చినా ఈ మార్గంలో రవాణా ఇప్పట్లో కష్టమని తేల్చేశారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి దేవుడి మీదే భారం వేసి వేచి చూస్తున్నారు.
భారీ నౌకను కదిలించిన పున్నమి చంద్రుడు
సూయజ్ కాలువలో చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌక ఇక బయటికి రావడం కష్టమని భావిస్తున్న సమయంలో పౌర్ణమి వచ్చింది. ప్రతీ పౌర్ణమికీ, అమావాస్యకీ సముద్ర ప్రవాహాల్లో విపరీతమైన మార్పులు జరగడం సాధారణమే. అలాగే ఈసారి కూడా ఈ సూయజ్ కాలువలోనూ అద్భుతం జరిగింది. పౌర్ణమి రోజున సూపర్ మూన్ దర్శనమిచ్చాడు. అంతే కాదు భారీగా అలలు ఎగసిపడ్డాయి. అంతే అంతటి భారీ నౌక సైతం కదిలిపోయింది. ఎక్కడో సముద్రంలో 18 అడుగుల లోతున ఇరుక్కున్న నౌకను రాకాసి అలలు బయటపడేశాయి. అంతే ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అక్కడున్న సిబ్బంది అంతా అవాక్కయ్యారు.
క్రేన్లు, టగ్ బోట్లు చేయలేని పని రాకాసి అలలు చేశాయిలా...
అప్పటివరకూ సూయజ్ కాలువలో ఇరుక్కున ఎవర్ గివెన్ నౌకను బయటికి తీసేందుకు భారీ క్లేన్లు, టగ్ బోట్లతో సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయినా భారీ నౌక అడుగు కూడా కదల్లేదు. కానీ పున్నమి చంద్రుడు తెచ్చిన రాకాసి అలలు ఈ భారీ నౌకను సైతం కదిలించాయి. అంతే రాకాసి అలల తాకిడికి సూయజ్ కాలువలో పెద్ద అద్భుతమే జరిగినట్లయింది. అప్పటివరకూ ఈ నౌక బయటికొస్తుందని ఏ మూల కూడా ఆశల్లేని పరిస్ధితి నుంచి ఇప్పుడు నౌక తిరిగి యథాతథస్దితికి చేరుకుందన్న వార్తలు ప్రపంచ దేశాల్ని సంతోషంలో నింపేస్తున్నాయి.
మానవ తప్పిదమే కారణంగా నిర్ధారణ
సూయజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్ గివెన్ కంటెయినర్ నౌక అయితే బయటికి వచ్చింది కానీ ఇది అసలు ఎలా చిక్కుకుపోయిందన్న అంశం మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే నిలిచింది. దీంతో ఈ షిప్‌ను పంపిన ఈజిప్ట్ అధికారులు ఇప్పుడు ఈ అంశంపై విచారణ జరుపుతున్నారు. సూయజ్ కాలువలో ఏడాది పొడవుగా వేలాది నౌకలు ప్రయాణాలు చేస్తుంటాయి. అలాంటిది ఈ నౌక మాత్రమే ఎందుకు చిక్కుకుందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈజిప్ట్ ప్రాధమిక విచారణలో మానవ తప్పిదం వల్లే ఈ నౌక ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీంతో బాధ్యులపై చర్యలకు ఈజిప్ట్ సిద్దమవుతోంది. ఈ మేరకు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications