పుతిన్ వద్దకు మోదీ దూతగా అజిత్ దోవల్..!!
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై ఏడాదికాలంగా కొనసాగుతూ వస్తోన్న నేపథ్యంలో- జాతీయ భధ్రత సలహాదారు అజిత్ దోవల్.. మాస్కోలో ప్రత్యక్షం అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం అయ్యారు.
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఇంకొద్ది రోజుల్లో ఈ యుద్ధానికి ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పై విరుచుకుపడింది రష్యా. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.

తూర్పు ప్రాంతం రష్యా ఆధీనంలో..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఉక్రెయిన్ ప్రతిఘటన..
రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. 11 నెలలుగా రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటోంది. కొన్ని సందర్భాల్లో పైచేయిని సాధించింది కూడా. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ..వారిని వెనక్కి పంపించగలిగింది.

రష్యాలో అజిత్ దోవల్..
ఈ పరిణామాల మధ్య జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. రష్యాలో పర్యటిస్తోన్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. బుధవారం ఆయన మాస్కోకు బయలుదేరి వెళ్లారు. ఆసియా దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉమ్మడిగా చేపట్టాల్సిన భద్రత చర్యలు, పసిఫిక్ రీజియన్ లో సరిహద్దు ఉద్రిక్తతలు.. వంటి అంశాలపై చర్చించడానికి మాస్కోలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ స్థాయి సమావేశానికి ఆయన హాజరు కానున్నారు.

హాజరు కానున్న దేశాలివే..
ఈ సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తోన్న రష్యాతో పాటు భారత్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, చైనా, తజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. న్యూఢిల్లీలో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి కొద్ది రోజు ముందు అజిత్ దోవల్.. రష్యాలో పర్యటిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుందివ. అదే సమయంలో మార్చి 1, 2 తేదీల్లో ఢిల్లీలో ఏర్పాటు కానున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా తరఫున సెర్గీ లావ్రోవ్ పాల్గొననున్నారు.

పుతిన్ తో భేటీ..
ఈ సందర్భంగా అజిత్ దోవల్.. ఇవ్వాళ మాస్కోలో ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. భారత్-రష్యా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు రక్షణ వంటి కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోవడం గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అమలు చేయడానికి అంగీకరించినట్లు వివరించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications