మెడికల్ మిరాకిల్.. 30 ఏళ్లు ఫ్రిడ్జ్ లో పిండంగా.. ఇప్పుడు శిశువుగా..

వైద్య శాస్త్రంలో కనీవినీ ఎరుగని అద్భుతం జరిగింది. 30 ఏళ్లపాటు శీతలీకరణ పద్ధతిలో భద్రపరిచిన పిండం ఇప్పుడు శిశువుగా మారింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఈ మిరాకిల్ జరిగింది. జులై 26 న జన్మించిన ఆ శిశువు ఇప్పుడు ప్రపంచంలోనే ఓల్డెస్ట్ బాయ్ గా చరిత్రలో నిలిచింది. క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో 1994 లో ఈ పిండాన్ని భద్రపరిచారు. 30 ఏళ్ల తర్వాత థాడెయిన్ పియర్స్ అనే మగబిడ్డ జన్మించింది. రీప్రొడక్టివ్ మెడిసిన్ లో ఇదో గొప్ప మైలురాయిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడు థాడెయిన్ పియర్స్ అనే బేబీ వరల్డ్ లోనే ఓల్డెస్ట్ బాయ్ గా నిలిచాడు. 2022 లో ఓరేగాన్ లో ఇద్దరు కవలలు ఇలాగే జన్మించారు. అయితే ఆ రికార్డును తాజాగా ఈ శిశువు చెరిపివేసింది.

అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన లిండ్ సే, టిమ్ పియర్స్ దంపతులకు పిల్లలు లేరు. సంతానం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ వారికి సంతాన భాగ్యం కలగలేదు. ఈ క్రమంలో లిండా ఆర్చర్డ్ అనే మహిళకు సంబంధించిన పిండాన్ని స్వీకరించాలని నిర్ణయానికి వచ్చారు. లిండా ఆర్చర్డ్ అండాలు.. ఆమె భర్త వీర్యకణాలను సేకరించి ఐవీఎఫ్ పద్ధతిలో నాలుగు పిండాలను వృద్ధి చేశారు. ఇందులో ఒక పిండం ద్వారా లిండా ఆర్చర్డ్.. కుమార్తెను పొందింది. మిగతా మూడు పిండాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో 1994 లో భద్రపరిచారు.

Ohio Miracle Baby Born After 30 Years of Cryopreservation

అయితే భద్రపరిచిన ఆ పిండాలను లిండా ఆర్చర్డ్.. ఎవరికీ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. వాటిని భద్రపరిచేందుకు వేల డాలర్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత వాటి పర్యవేక్షణ ఓ క్రిష్టియన్ కంపెనీ తీసుకుంది. అయితే ఈ పిండాలు ఎవరికి కావాలో వారికి కొన్ని షరతులు పెట్టింది లిండా. ఆ రూల్స్ లిండ్ సే, టిమ్ పియర్స్ దంపతులకు సరిపోవడంతో.. లిండ్సే గర్భంలోకి రెండు పిండాలను ప్రవేశపెట్టారు. అందులో ఒక పిండం జులై 26 న జన్మించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+