చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన ఆ అంతర్జాతీయ సదస్సు..నిరవధిక వాయిదా
బెర్న్: దావోస్.. ఈ పేరు వినగానే ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లో ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సు గుర్తుకు వస్తుంది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య వేత్తలు, వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు గుర్తుకు వస్తుంటుంది. దానికంటే ముందు- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు స్ఫూరిస్తుంటుంది. ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో దాదాపు ప్రతి సంవత్సరం ఆయన క్రమం తప్పకుండా దావోస్ సదస్సుకు హాజరయ్యే వారు.

ఒమిక్రాన్ దెబ్బకు..
అయిదు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పాల్గొనడానికి చంద్రబాబు ప్రత్యేక విమానంలో మంత్రులు, అధికారులతో కలిసి వెళ్లేవారు. ప్రపంచ దేశాలకు చెందిన బిగ్‌షాట్స్‌తో భేటీ అయ్యేవారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని వచ్చే విషయంపై రోడ్ షోలను సైతం నిర్వహించే వారు. ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటయ్యే ఈ దావోస్ సదస్సు వాయిదా పడింది. కారణం- ఒమిక్రాన్ వేరియంట్.

జనవరి 17 నుంచి..
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ఈ సదస్సును వాయిదా పడింది. ఈ మేరకు ఈ ఫోరం ఓ ప్రకటన విడుదల చేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. దీనితో ఇది నిరవధిక వాయిదా పడినట్టయింది. షెడ్యూల్ ప్రకారం.. 2022 జనవరి 17 నుంచి 21 తేదీల మధ్య దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటం వల్ల దీన్ని వాయిదా వేసినట్లు తెలిపింది.

స్విస్‌పై ఒమిక్రాన్ ఎఫెక్ట్..
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావానికి గురైన దేశాల్లో స్విట్జర్లాండ్ కూడా ఉంది. అక్కడ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి వచ్చే వారిపై కఠిన ఆంక్షలను విధించింది. విమాన ప్రయాణాలను కట్టుదిట్టం చేసింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాలతో వాయు సంబంధాలను తెంచుకుంది. ఈ పరిణామాల మధ్య ప్రపంచ ఆర్థిక సదస్సును నిర్వహించలేమని ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ క్లాస్ ష్క్వాబ్ తెలిపారు.

పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే..
దాదాపు అన్ని దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య వేత్తలు హాజరు కావాల్సి ఉందని, ఈ ఆంక్షల వల్ల అది సాధ్యపడట్లేదని స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరిస్థితులు మెరుగుపడేంత వరకూ ఈ సదస్సును నిర్వహించే అవకాశం లేదని అన్నారు. అందుకే- వాయిదా వేసిన ఈ సదస్సును మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది చెప్పలేకపోతున్నామని పేర్కొన్నారు.

స్విట్జర్లాండ్‌లో కఠిన నిబంధనలు..
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం వల్ల భౌతిక దూరాన్ని పాటించడం, సదస్సులో భాగంగా ఇన్ పర్సన్ సమావేశాలను నిర్వహించడం, వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణించడం సాధ్యం కాదని డబ్ల్యూఈఎఫ్ ఛైర్మన్ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న నిబంధనలు సైతం దీనికి అంగీకరించవని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. భారత్ సహా 89 దేశాలపై పంజా విసిరింది.

బ్రిటన్‌పై పంజా..
ప్రత్యేకించి బ్రిటన్‌పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. వేల సంఖ్యలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు అక్కడ నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అత్యధిక ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నమోదు చేసిన దేశాల జాబితాలో బ్రిటన్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ వేరియంట్‌కు పుట్టినిల్లుగా చెప్పుకొనే దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, నార్వే, బెల్జియం, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications