కోలంబోకు దగ్గరలో మరో బాంబు పేలుడు
శ్రీలంక లో నేడు మరో బాంబు పేలిందని లంక పోలీసులు తెలిపారు. రాజధాని కొలంబో కు 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న పుగోడా లోని మేజిస్ట్రేట్ కోర్టు వెనకాల ఉన్న ఖాలీ స్థలంలో బాంబు పేలినట్టు పోలీసులు గుర్తించారు. కాగా గత నాలుగు రోజుల క్రితం ఈస్టర్ పండుగ దినాన పేలిన బాంబు ఘటన అనంతరం వరుసగా ఎక్కోడో ఓ చోట బాంబులు పేలుతుండడతో లంకలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. దీంతో అత్యవసర పరిస్థితిని సైతం లంక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టెన్షన్ వాతవరణం నెలకోంది. ఎలాంటీ ప్రాణాహని జరగలేదని తెలుస్తోంది.













Click it and Unblock the Notifications