తెరుచివున్న డోర్: గాలిలోనే విమానం దారిమళ్లింపు
సిబు: విమానం టేకాఫ్ అయి దాదాపు 40 నిమిషాలు అయింది. 163మంది ప్రయాణికులతో ఆ విమానం గాలిలో ప్రయాణిస్తోంది. ఒక్కసారిగా విమానంలో శబ్ధాలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది ఆ విమానం తలుపు(డోర్) సరిగా పడలేదని గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పైలట్‌కు తెలిపారు. దీంతో ఆ విమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు.
ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని సిబు విమానాశ్రయం నుంచి దక్షిణ కొరియా వెళ్తున్న విమానాన్ని అకస్మాత్తుగా వెనక్కి దారి మళ్లించారు. కొరియాకు చెందిన ఆ జిన్ ఎయిర్ సంస్థ విమానంలో సుమారు 163 మంది ప్రయాణికులు ఉన్నారు.

డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు గుర్తించిన సమయంలో ప్లేన్ సుమారు పది వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. వెంటనే విమానాన్ని వెనక్కి దారి మళ్లించే విషయాన్ని ముందుగానే ఇన్‌ఫ్లయిట్ ఆఫీసర్లు ప్రయాణికులకు తెలియజేశారు. ఆ తర్వాత విమానాన్ని సిబులో ల్యాండ్ చేశారు.
కాగా, ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి చింతిస్తూ జిన్ ఎయిర్ సంస్థ వారికి 84.28 డాలర్లను నష్ట పరిహారంగా చెల్లించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు దక్షిణికొరియాకు చెందిన రవాణా మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications