టర్కీ, సిరియాలో భూకంపం-పెను విధ్వంసం: 1600 మందికిపైగా మృతి, ఇటలీకి సునామీ వార్నింగ్
టర్కీ, సిరియాలో తీవ్ర భూకంపం పెను విషాదాన్ని నింపింది. సోమవారరం తెల్లవారుజామను సంభవించిన భారీ భూకంపంతో పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి.
అంకారా: టర్కీ, సిరియాలో తీవ్ర భూకంపం పెను విషాదాన్ని నింపింది. సోమవారరం తెల్లవారుజామను సంభవించిన భారీ భూకంపంతో పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ పెను భూకంపం కారణంగా రెండు దేశాల్లో 1600 మందికిపైగా పౌరులు మృతి చెందారు. వేలాది మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు.
టర్కీ, సిరియాలో భూకంపంతో పెను విధ్వంసం
స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూ భూకంపం సంభవించింది. భూకంప లేఖిని దీని తీవ్రత 7.8గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. టర్కీలోని గాజియాన్ తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం సంభవించిన పావుగంట తర్వాత మరోసారి 6.7 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత కూడా పలుమార్లు భూమి కంపించినట్లు తెలిపారు.
భూకంపంతో 1600 మందికిపైగా మృతి
ఈ తీవ్ర భూకంపం, ప్రకంపనలతో టర్కీ, సిరియా దేశాల్లో పలు నగరాల్లోని వందలాది భవనాలు నేలమట్టాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. పలు భవనాల్లో చిక్కుకున్న వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 1600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఇంకా వేలాది మంది భవనాల శిథిలా కింద చిక్కుకుపోయారని చెప్పారు. వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
టర్కీ, సిరియా భూకంపంతో ఇటలీకి సునామీ హెచ్చరిక
టర్కీ, సిరియాలో పెను భూకంపంతో ఇటలీలో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లో భారీ అలలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ అలలు విరుచుకుపడటంతో తీరం వెంబడి ఉన్న పలు నివాసాలు కుప్పకూలాయి. అప్పటికే అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.












Click it and Unblock the Notifications