వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ivermectin: కరోనా ట్రీట్‌మెంట్ రివాల్యూషన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయనం

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ.. మరో కీలక ప్రయోగానికి తెర తీసింది. జర్మనీకి చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్.. భారత్ సహా అనేక దేశాలకు వరంగా మారింది. భారత్‌లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మెజారిటీ వాటా కోవిషీల్డ్‌దే. పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దీన్ని ఉత్పత్తి చేస్తోంది.

Bharat Biotech: కోవాగ్జిన్ భవితవ్యమేంటీ: డబ్ల్యూహెచ్‌ఓ భేటీకి అటెండ్Bharat Biotech: కోవాగ్జిన్ భవితవ్యమేంటీ: డబ్ల్యూహెచ్‌ఓ భేటీకి అటెండ్

ఇదిలావుండగా- ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నిపుణులు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. యాంటీ-పారాస్టిక్ డ్రగ్ ఐవర్‌మెక్టిన్ (Ivermectin)ను వినియోగించడంపై పరిశోధనలు చేస్తోన్నారు. ఐవర్‌మెక్టిన్‌‌పై సాగిస్తోన్న ఈ ప్రయోగాలు విజయవంతమైతే.. మరిన్ని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు అందజేసే వైద్య చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ను వినియోగించడానికి వీలు కలుగుతుందని, దీనివల్ల మరింత వేగంగా కోలుకోవడానికీ అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తోన్నారు.

 Oxford University says it was testing anti-parasitic drug ivermectin as a treatment for Covid19

కరోనా వైరస్ ప్రారంభదశలో సైతం ఆసుపత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఐవర్‌మెక్టిన్ డ్రగ్ ఉపయోగపడేలా దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం ఉపకరిస్తుందని అంటోన్నారు. ప్రారంభ దశలో దీన్ని వినియోగించడం వల్ల వైరల్ ఇన్‌ఫెక్షన్ తీవ్రత గణనీయంగా తగ్గిందనే విషయం తమ అధ్యయనంలో తేలినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తెలిపింది. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వానికి ఓ నివేదికను అందించినట్లు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్ చేస్తోన్న ఈ ప్రయత్నాలకు బ్రిటన్ ప్రభుత్వం తనవంతు సహకారాన్ని అందిస్తోంది.

 Oxford University says it was testing anti-parasitic drug ivermectin as a treatment for Covid19

కరోనా బారిన పడిన పేషెంట్లకు అందించే చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్ వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నప్పటికీ.. దాన్ని వాడాలని సిఫారసు చేయలేదు. దీర్ఘకాలంలో దీనివల్ల ప్రతికూల ప్రభావం ఉండొచ్చని తెలిపింది. ఐవర్‌మెక్టిన్‌ చికిత్స పొందినవారిలో 56 శాతం తక్కువగా మరణాలు ఉన్నప్పటికీ దాని వినియోగానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ పరిస్థితుల్లో దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయనం చేపట్టింది.

Recommended Video

Karanam Malleswari Has Appointed As The Vice Chancellor Of Delhi Sports University | Oneindia Telugu

English summary
The University of Oxford said it was testing anti-parasitic drug ivermectin as a possible treatment for Covid-19, as part of a British government-backed study that aims to aid recoveries in non-hospital settings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X