పాకిస్థాన్ ప్రజలకు బిగ్ షాక్.. జిల్లెట్ రేజర్, హెడ్ అండ్ షోల్డర్ షాంపూలు కూడా దొరకట్లేదు..!
పాకిస్థాన్ పరిస్థితి మరోసారి అధ్వానంగా మారింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం కావడంతో చాలావరకు మల్టీ నేషనల్ కంపెనీలు ఆ దేశంలోకి వచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సంస్థలు బయటకు వెళ్లిపోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడి ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారినట్లు తెలుస్తోంది. తాజాగా నిత్యావసరాల సంస్థగా పేరుగాంచిన ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్(పీ అండ్ జీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. పాకిస్థాన్ లోని తమ కార్యకలాపాలను క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు బ్లూమ్ బర్గ్ రిపోర్టు పేర్కొంది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పీ అండ్ జీ కంపెనీ ప్రొడక్ట్స్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హోమ్ కేర్ అండ్ క్లీనింగ్, ఫ్యామిలీ కేర్, బ్యూటీ అండ్ గ్రూమింగ్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. ఈ మేరకు పాకిస్థాన్ లో తమ కార్యకలాపాలను ముగించేందుకు ఈ సంస్థ సిద్ధమైనట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక స్పష్టం చేస్తోంది. అలాగే జిల్లెట్ పాకిస్థాన్ కంపెనీ కూడా పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్ నుంచి డీ లిస్టింగ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పాకిస్థాన్ లోని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. ఇకపై దేశంలో నిత్యావసర వస్తువులైన సబ్బులు ఇతర వ్యక్తిగత వస్తువులు, డిటర్జెంట్, షేవింగ్ క్రీమ్ లాంటి వాటిపై కొరత ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లో 240 మిలియన్ మందికి వీటి అవసరం ఉందని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు పెట్టినట్లు సమాచారం.

ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్(పీ అండ్ జీ) సంస్థ 1991 లో పాకిస్థాన్ లోకి ప్రవేశించింది. టాప్ కన్జూమర్ గూడ్స్ సంస్థగా ఎదిగింది. పాంపర్స్, సేఫ్ గార్డ్, ఏరియల్, హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ, పాంటీన్ ఉత్పత్తులను విక్రయించింది. అయితే తాజాగా ఈ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము పాకిస్థాన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. థర్డ్ పార్టీ ద్వారా తమ వినియోగదారులకు సేవలు అందిస్తామని పేర్కొంది. తమ ఉద్యోగులకు విదేశాల్లో ప్లేస్ మెంట్స్ ఇప్పిస్తామని లేదా సెపరేషన్ ప్యాకేజీలను ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మల్టీనేషనల్ కంపెనీలు పాకిస్థాన్ నుంచి వైదొలిగాయి. వాటిలో షెల్, ఫైజర్, టోటల్ ఎనర్జీస్, టెలెనార్ కంపెనీలు ఆ దేశం నుంచి నిష్క్రమించాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications