కాశ్మీర్‌పై తీర్మానం: సమితి వైఫల్యమన్న పాక్ ప్రధాని
న్యూఢిల్లీ: కాశ్మీర్‌పై పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి తన నీచ బుద్ధిని బయట పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్ ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్.
బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని దశాబ్దాలుగా భారత్-పాక్‌ల మధ్య ఉన్న కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆయన నాలుగు సూత్రాల శాంతి ఫార్ములాను ప్రతిపాదించారు.

* కాశ్మీర్‌ను సైన్య రహితంగా చేయడం.
* కాశ్మీర్‌కు సమీపంలోని సియాచిన్ నుంచి సైనిక దళాలను ఉపసంహరించడం.
* వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాలు సైన్యాన్ని ఉపయోగించకుండా ఉండటం, ఉపయోగిస్తామని బెదిరించడం కానీ చేయకూడదు.
* 2003లో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి.

పైన పేర్కొన్న నాలుగు సూత్రాలను భారత్-పాక్ దేశాలు అమలు చేస్తే ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొంటాయని తెలిపారు. భారత్-పాక్ సంబంధాలను ఘర్షణతో కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
కాశ్మీర్ అంశంపై తీర్మానాన్ని అమలు చేయకపోవడం ఐక్యరాజ్యసమితి వైఫల్యమని పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కాశ్మీరీలను భాగస్వాములను చేయాలని తేల్చి చెప్పారు. గతవారంలో అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు కొద్దిదూరం నుంచే చిరునవ్వుతో అభివాదం చేసుకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications