"పాకిస్థాన్ పైకి 80 డ్రోన్ లు.. ఎయిర్ బేస్ ధ్వంసం"

పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, డిప్యూటీ ప్రధాని ఇషాక్ దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వార్షిక ప్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ రావల్పిండి, చకాలాలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని ఆరోపణలు చేశారు. భారత్ దాడికి తమ మిలిటరీ మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు తెలిపారు.

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న ఉగ్రమూకలు జరిపిన దాడుల్లో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగా మే 7 న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే ఇదే విషయంపై తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, డిప్యూటీ ప్రధాని ఇషాక్ దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ రావల్పిండి, చకాలాలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని ఆరోపణలు చేశారు. భారత్ దాడికి పాకిస్థాన్ మిలిటరీ మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు వివరించారు.

"భారత్.. పాకిస్థాన్ పైకి 80 కు పైగా డ్రోన్ లను ప్రయోగించింది. 36 గంటల్లో 80 కు పైగా డ్రోన్ లను పంపింది. వాటిలో 79 డ్రోన్ లను మేము కూల్చేశాం. ఒక్క డ్రోన్ మాత్రం మిలిటరీ ఇన్ స్టాలేషన్ పై పడింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాక్షికంగా ధ్వంసం అయింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైన్యం కూడా గాయపడింది" అని ఇషాక్ దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సంధించిన దాదాపు అన్ని డ్రోన్ లను కూల్చేశామని.. ఒక్క డ్రోన్ మాత్రమే తమ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసిందని వివరించారు. భారత్ సరిహద్దులోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ కు చెందిన క్షిపణులు, డ్రోన్ లు దాడులకు పాల్పడిన అనంతరం పాక్ లోని ఎయిర్ బేస్ పై భారత్ దాడులు చేసిందన్నారు.

ఇక ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన పాకిస్థాన్ కు చెందిన టెర్రర్ సంస్థ ది రెసిస్టాన్స్ ఫ్రంట్(TRF) లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. దాడుల ద్వారా పాకిస్థాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే కాకుండా ఆ దేశానికి గట్టి మెసేజ్ ను చేర వేసింది. ఈ మేరకు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.

Pakistan Admits Damage Ishaq Dar Confirms Indian Strike on Nur Khan Air Base During Operation Sindoor

వీటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ ధ్వంసం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+