పాకిస్థాన్ కు బిగ్ షాక్.. కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం..
పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని మియాన్ వాలీ ప్రాంతంలో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం కుప్పకూలింది. ఘటన సమయంలో ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రాథమిక అంచనాల ప్రకారం పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హాంగుడు JL-8(K-8 కరకోరం) అనే శిక్షణ జెట్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైంది. కానీ ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే ఇంజిన్ లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు భద్రతా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విమాన ప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు అధికారులు.
మరోవైపు పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ మీడియా ముందు నవ్వులపాలైంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అందుకు ప్రతిగా భారత్ పై పాకిస్థాన్ ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ కు చేపట్టింది. అందులో భాగంగా భారత్ లోని రెండు వైమానిక స్థావరాలపై విజయవంతంగా క్షిపణులతో దాడులు చేశామని ఓ పాకిస్థానీ ఆర్మీ అధికారి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తాము భారత్ లోని రాజౌరీ ఎయిర్ బేస్, మామున్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశామని తెలిపారు. అయితే భారత్ లో ఆ పేర్లతో ఎలాంటి వైమానిక స్థావరాలు లేవు. దాంతో అంతర్జాతీయంగా పాకిస్థాన్ మరోసారి నవ్వులపాలైంది.

ఇక పాకిస్థాన్ చెప్పిన వివరాల ప్రకారం రాజౌరీ అనే ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇది సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సున్నితమైన ప్రాంతం. అయితే ఇక్కడ ఎలాంటి ఎయిర్ బేస్ లేదు. ఇక మామున్.. ఇది పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాలో ఉన్న ఒక మిలిటరీ కంటోన్మెంట్ మాత్రమే.. ఇక్కడ ఎయిర్ బేస్ లేదు. దాంతో అసలు ఉనికిలో లోని ఎయిర్ బేస్ లపై పాకిస్థాన్ దాడి చేశామని చెప్పుకోవడంతో పాకిస్థాన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications