తన గొయ్యి తానే తీసుకుంటున్న పాకిస్థాన్.. చైనా మెప్పుకోసం..!

పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్ నుంచి వచ్చే విమానాలకు గగనతలం మూసివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తైవాన్ కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది పాకిస్థాన్. చైనా అనుసరిస్తున్న వన్- చైనా పాలసీలో భాగంగా పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అంతర్జాతీయ ఏవియేషన్ సెక్టార్ లో ఈ మేరకు చైనాకు పాకిస్థాన్ దౌత్య విధానం పరంగా మద్దతుగా నిలిచింది. ఇక భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్- చైనా మధ్య గత కొంత కాలంగా సత్సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య పలు రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

అయితే పాకిస్థాన్ తీసుకున్న ఈ సడెన్ నిర్ణయంతో తైవాన్ కు చెందిన రెండు విమానయాన సంస్థలు ఆసియా, యూరోప్ ఖండాల్లో ప్రయాణంపై కొత్త రూట్లను వెతుక్కుంటున్నాయి. తైవాన్ విషయంలో చైనా కూడా ఇప్పటివరకూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైనాలో ఇప్పటికీ తైవాన్ విమానాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం ఇలా దుందుడుకుగా వ్యవహరించడం గమనార్హం. ఇలా చేయడం వల్ల పాకిస్థాన్ కే ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ఏవియేషన్ కు ఇది పెద్ద దెబ్బే.. కానీ ఆ దేశం మాత్రం అది ఆలోచించడం లేదు. ఇక ఇదంతా చైనా మెప్పు పొందేందుకేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే విషయంపై పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా అసిఫ్.. బ్లూమ్ బర్గ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "పాకిస్థాన్ ఏవియేషన్ సంస్థ వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉంది. చైనా, తైవాన్ సెపరేట్ కాదన్న చైనా నిర్ణయానికి మా మద్దతు ఉంది. ఈ పాలసీలో భాగంగా కేవలం మెయిన్ ల్యాండ్ చైనా నుంచి వచ్చే విమానాలకే అనుమతి ఉంటుంది. కేవలం చైనీస్ ఎయిర్ లైన్స్ మాత్రమే పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణానికి అనుమతి ఉంటుంది" అని పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా అసిఫ్ తాజాగా వెల్లడించారు.

బ్లూమ్ బర్గ్ అంతర్జాతీయ కథనం ప్రకారం తైవాన్ ఎయిర్ లైన్స్ ను నిషేధించిన తొలి దేశంగా పాకిస్థాన్ నిలిచింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. తైవాన్ కు చెందిన చైనా ఎయిర్ లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఇవా ఎయిర్ వేస్ కార్పొరేషన్ సంస్థలకు చెందిన విమానాలు అక్టోబర్ 25 ఉదయం నుంచి పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించలేదు. ఈ మేరకు తైవాన్ విషయంలో చైనా వైఖరిని ఇతర దేశాలు కూడా సమర్థిస్తున్నట్లు తెలిపేందుకే పాకిస్థాన్- చైనా ఇలా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Pakistan bans Taiwan airlines in line with the One China policy Pakistan china relations latest

ఈ మేరకు పాకిస్థాన్- చైనా మధ్య ఐరన్- క్లాడ్ ఫ్రెండ్ షిప్ కొనసాగుతోందని తెలిపారు. అయితే పాకిస్థాన్ మాత్రం అటు అమెరికాతోనూ సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. ఇక తైవాన్ విషయంలో చైనా వైఖరిని అమెరికా తప్పుబడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మరి రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+