పాకిస్తాన్ ను గట్టిగా గిల్లి వదిలిపెట్టిన డొనాల్డ్ ట్రంప్: ఏడుపొక్కటే తక్కువ..

పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తెలిసి చేశారో.. తెలియక చేశారో గానీ అమెరికా అధికారికంగా విడుదల చేసిన భారతదేశ మ్యాప్ ఇప్పుడీ రెండు దేశాల మధ్య చర్చలకు దారి తీసింది. పాకిస్తాన్ ను ఇబ్బందులకు గురి చేసింది. దీనిపై పాకిస్తాన్ అభ్యంతరం సైతం వ్యకం చేయడం- దీనికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేసినట్టయింది. భారత మ్యాప్ గురించి తమ అభ్యంతరాలను అమెరికాకు తెలియజేసినట్లు పాకిస్తాన్ వెల్లడించింది.

అమెరికా-భారత్ మధ్య 30 ట్రిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కార్యాలయం తన ఎక్స్ అకౌంట్ లో ఈ మ్యాప్‌ను పోస్ట్ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), అక్సాయ్ చిన్‌ను భారత్ లో అంతర్భాగంగా చూపించారు. సాధారణ మ్యాప్ లో ఉండే ఈ రెండు ప్రాంతాల నియంత్రణ, వాస్తవాధీన రేఖలు ఇందులో లేవు. అటు పీఓకే వద్ద గానీ, ఇటు అక్సాయ్ చిన్ వద్ద గానీ ఎటువంటి సరిహద్దులు పొందుపర్చలేదు. ఈ రెండు ప్రాంతాలు కూడా భారత భూభాగంగా చిత్రీకరించిన మ్యాప్ ఇది.

Pakistan Calls Out US for India Map of with Jammu and Kashmir in Trade Deal Reveal Removed by USTR

వివాదాస్పద కాశ్మీర్‌పై అమెరికా దీర్ఘకాలంగా తటస్థంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విధానానికి భిన్నంగా తాజా మ్యాప్ విడుదలైంది. దీంతో పాకిస్తాన్‌కు తీవ్ర షాక్ కు గురైంది. ఇది సరికాదని పేర్కొంటూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయాన్ని సంప్రదించింది. ఈ మ్యాప్ లో సవరణు చేయాలని కోరింది. ఈ మ్యాప్ సరైనది కాదని, తమ అభ్యంతరాలను అమెరికాకు తెలియజేశామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రబీ తెలిపారు.

ఐక్యరాజ్యసమితి గుర్తించిన మ్యాప్‌లలో జమ్మూ కాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తాయని, దానికి ఐరాస తీర్మానాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పరిష్కారం జరగాలని స్పష్టం చేశారు. ఈ పోస్ట్- పొరపాటా లేక డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశ్యపూర్వక విధానమా అనేది చర్చనీయాంశమైంది. భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడం అమెరికా తటస్థ వైఖరికి భిన్నమని చెబుతున్నారు. ఒత్తిడి, వివాదం నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఆ పోస్ట్‌ను తొలగించింది.

గతంలో అమెరికా విడుదల చేసినన భారతదేశ మ్యాప్ లల్లో పీఓకే, అక్సాయ్ చిన్‌ వేర్వేరు ప్రాంతాలుగా ఉండేవి. ఇది మాత్రం వివాదాన్ని రేకెత్తించింది. ట్రంప్ హయాంలో భారత్-అమెరికా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం తన పలుకుబడిని తగ్గిస్తుందని పాకిస్తాన్ భయపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.. ఈ మ్యాప్ విడుదలైన తర్వాత. దీన్ని తొలగించినప్పటికీ- భారత్ తో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+